జాతీయ వార్తలు

ముక్కలుగా నరికారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, అక్టోబర్ 29: భారత్-పాక్ సరిహద్దుల వద్ద పాక్ రేంజర్లు యథేచ్ఛగా కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. శుక్రవారం రాత్రి పాకిస్తానీ రేంజర్లు కాల్పులు జరుపుతుండగా, ఆ కాల్పుల చాటున నియంత్రణ రేఖ దాటి వచ్చిన ఉగ్రవాదులు ఒక జవానును దారుణంగా చంపి, నరికి ముక్కలు చేసి, తలను ఛిద్రం చేసి తమ కిరాతకాన్ని చాటిచెప్పారు. ఈ సంఘటనపై తీవ్రంగా స్పందించిన సైన్యం ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించింది. ఉగ్రవాదుల్లో ఒకరిని మన సైనికులు కాల్చి చంపేశారు. మిగతా వారు పాక్ సైన్యం కాల్పుల మధ్య పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోకి పారిపోయారు. మరోవైపు ఈ రోజు ఉదయం పాకిస్తానీ భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో కోలీ నితిన్ సుభాష్ అనే మహారాష్టల్రోని సాంగ్లికి చెందిన 28 ఏళ్ల కానిస్టేబుల్ అమరుడైనట్లు బిఎస్‌ఎఫ్ అధికారి ఒకరు చెప్పారు. 2008లో బిఎస్‌ఎఫ్‌లో చేరిన సుభాష్‌కు భార్య, ఇద్దరు కుమారులున్నారు.
నిన్న రాత్రి పాక్ సైన్యాల కాల్పుల సాయంతో ఉగ్రవాదులు నియంత్రణ రేఖను దాటివచ్చి మన్‌దీప్ సింగ్ అనే జవానును చంపి మృతదేహాన్ని ముక్కలుగా నరికేసి, మృతదేహాన్ని ఛిద్రం చేసిన సంఘటనపై సైన్యం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత సైన్యం పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై మెరపు దాడులు జరిపి పెద్దఎత్తున ఉగ్రవాదులను మట్టుపెట్టనప్పటినుంచి జమ్మూ, కాశ్మీర్‌లోని సరిహద్దు వెంబడి పాక్ సైన్యాలు నిత్యం కాల్పుల ఒప్పందం ఉల్లంఘనలకు పాల్పడుతున్న విషయం తెలిసిందే.
పాకిస్తానీ రేంజర్లు శనివారం ఆర్‌ఎస్‌పురా, కతువా సెక్టార్ల కూడాలో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి కాల్పులకు తెగబడ్డారు. నిన్న రాత్రి జరిగిన దాడిలో దాడి చేసిన ఒక ఉగ్రవాదిని మన జవాన్లు హతమార్చారు. నిన్న సాయంత్రం నియంత్రణ రేఖకు సమీపంలో జరిగిన ఒక ఎన్‌కౌంటర్‌లో ఒక సైనికుడు అమరుడైనాడని, మరో టెర్రరిస్టు హతమైనాడని సైన్యం తెలిపింది.
సైన్యం దీటుగా సమాధానమిస్తోంది
న్యూఢిల్లీ: పాక్ సైన్యం సరిహద్దుల్లో జరుపుతున్న కాల్పులకు మన సైన్యం దీటుగా సమాధానమిస్తోందని హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. అంతేకాదు, భారత దేశం ఎవరిముందూ తల వంచదని కూడా ఆయన స్పష్టం చేశారు. దేశ ప్రజలు దీపావళిని ఆనందంగా జరుపుకొంటున్నారంటే భద్రతా దళాలు సరిహద్దులను కాపాడుతున్నందువల్లనే అది సాధ్యమవుతోంది.
శత్రువుల కుట్రలను భగ్నం చేస్తున్న మన భద్రతా దళాల పట్ల ప్రజలు విశ్వాసముంచాలని రాజ్‌నాథ్ ఢిల్లీలో విఖరులతో మాట్లాడుతూ అన్నారు.