జాతీయ వార్తలు

కొలువుదీరిన మెహబూబా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మూ, ఏప్రిల్ 4: సుదీర్ఘ తర్జన భర్జనలు, మంతనాల నేపథ్యంలో ఎట్టకేలకు జమ్మూకాశ్మీర్ తొలి మహిళా ముఖ్యమంత్రిగా పిడిపి అధినేత్రి మెహబూబా ముఫ్తీ సోమవారం పదవీ స్వీకార ప్రమాణం చేశారు. 56 ఏళ్ల మెహబూబా చేత గవర్నర్ ఎన్‌ఎన్ వోరా ప్రమాణం చేయించారు. తన తండ్రి హయాంలో మాదిరిగానే బిజెపితో కలిసి 22 మంది మంత్రులతో కూడిన సంకీర్ణ ప్రభుత్వాన్ని ఆమె ఏర్పాటు చేశారు. గతంలో మాదిరిగానే బిజెపి సీనియర్ నేత నిర్మల్‌సింగ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. తాజా పరిణామంతో గత మూడు నెలలుగా సాగిన గవర్నర్ పాలనకు తెరపడింది. గత మంత్రివర్గంలో లభించిన స్థానాలకంటే కూడా ఈసారి బిజెపికి మరో రెండు పదవులు లభించాయి. అంటే బిజెపి మంత్రుల సంఖ్య సంకీర్ణ ప్రభుత్వంలో ఆరు నుంచి ఎనిమిదికి పెరిగింది. అలాగే కేబినెట్ మంత్రులుగా ఇద్దరికి పదోన్నతి లభించింది. రాష్ట్ర 13వ ముఖ్యమంత్రిగా అలాగే తొలి మహిళా సిఎంగా దేశంలోనే రెండో ముస్లిం ముఖ్యమంత్రిగా కూడా ప్రత్యేక ఘనతను సాధించారు. 1980లో అస్సాంలో తొలి మహిళా ముఖ్యమంత్రిగా సయిదా అన్వారా తైమూర్ బాధ్యతలు నిర్వహించారు. మెహబూబాతోపాటు మరో 21 మంది చేత గవర్నర్ ప్రమాణం చేయించారు. కొత్త మంత్రివర్గంలో పిడిపి కేబినెట్ మంత్రులు తొమ్మిది మంది ఉంటారు. గతంలోకంటే కేబినెట్ మంత్రుల సంఖ్యను పిడిపి అధినేత్రి తగ్గించారు. రాజ్‌భవన్‌లో జరిగిన ప్రమాణ స్వీకారోత్సవానికి మాజీ ముఖ్యమంత్రులు ఫరూక్ అబ్దుల్లా, ఆయన కుమారుడు ఒమర్ అబ్దుల్లా, కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, జితేందర్ సింగ్‌లతోపాటు అధికారులు, ప్రముఖులు హాజరయ్యారు. కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారానికి వీలుగా సోమవారం ఉదయమే గవర్నర్ పాలనను తొలగించారు. కొత్త ప్రభుత్వానికి ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా ఇది పనిచేయగలదని ఆశాభావం వ్యక్తం చేశారు.

చిత్రం జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రిగా మెహబూబా ముఫ్తీ చేత పదవీ స్వీకార ప్రమాణం చేయస్తున్న గవర్నర్ ఎన్‌ఎన్ వోరా