జాతీయ వార్తలు

జిఎస్‌టి ఖరారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 3: ఎట్టకేలకు నాలుగు అంచెల వస్తు సేవల పన్ను (జిఎస్‌టి) విధానం ఖరారైంది. నిత్యావసర వస్తువులకు తక్కువ శాతం పన్ను, విలాసవంతమైన వస్తువులకు అత్యధిక శాతం పన్నుగా నిర్ధారించారు. అత్యధిక విలాస వస్తువులకు జిఎస్‌టితోపాటు సెస్ కూడా విధిస్తారు. విలాసవంతమైన కార్లు, పొగాకు, ఏరియేటెడ్ డ్రింక్‌లకు కూడా సెస్సు విధిస్తారు. అయితే ఆహార ధాన్యాలకు శూన్య పన్ను విధానాన్ని వర్తింపజేయాలని నిర్ణయించారు. బంగారంపై నాలుగు శాతం జిఎస్‌టి లెవీ విధించాలన్న కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనను పలు రాష్ట్రాలు గట్టిగా వ్యతిరేకించటంతో ప్రస్తుతానికి ఈప్రతిపాదనను వాయిదా వేశారు. ఐదు, పనె్నండు, పద్దెనిమిది, ఇరవై ఎనిమిది శాతంగా నిర్ధారించిన జిఎస్‌టి స్లాబ్‌లను పార్లమెంటు ఆమోదించవలసి ఉంటుంది. ఈ నెల 16 నుండి ప్రారంభమవుతున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో దీనికి సంబంధించిన బిల్లును ప్రతిపాదించనున్నారు. జిఎస్‌టి అమలులోకి రావటంతో కేంద్రం, రాష్ట్రం విధించే ఎక్సైజ్, సర్వీస్,వ్యాట్ తదితర పన్నులన్నీ రద్దు అవుతాయి. ఇదిలా ఉంటే ఇంతకు ముందు ప్రభుత్వం ప్రతిపాదించిన 6, 12, 18, 26 శాతం పన్నుల విధానంతో పోలిస్తే జిఎస్‌టి రేట్లు అధికంగా ఉండటం గమనార్హం. ఆహార ధాన్యాలను జిఎస్‌టి పరిధి నుండి మినహాయించాలని నిర్ణయించారు.
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ అధ్యక్షతన గురువారం జరిగిన జిఎస్‌టి సమాఖ్య సమావేశంలో జిఎస్‌టి రేట్లపై ఏకాభిప్రాయం కుదిరింది. ఆహార ధాన్యాలను జిఎస్‌టి నుండి మినహాయించారు. అయితే దీనిని పన్ను మినహాయింపు అనకుండా శూన్య పన్ను పరిధిగా భావిస్తారని అరుణ్ జైట్లీ విలేఖరుల సమావేశంలో తెలిపారు. అన్ని రాష్ట్రాల అర్థిక శాఖ మంత్రులతో కూడిన జిఎస్‌టి సమాఖ్యలో పన్నుల రేట్లపై ఏకాభిప్రాయం కుదిరిందని జైట్లీ తెలిపారు. ఆహార ధాన్యాలతోపాటు వినియోగదారుల ధరల ఇండెక్స్ బాక్సు పరిధిలోని దాదాపు యాభై శాతం వస్తువులు శూన్య పన్ను పరిధిలోకి వస్తాయని జైట్లీ వివరించారు. దీని వలన దేశంలో సగటు మనిషిపై ద్రవ్యోల్బణం ప్రభావం ఎంత మాత్రం పడదని ఆయన స్పష్టం చేశారు. ఐదు శాతం పరిధిలోకి సామాన్య జనం ఉపయోగించే సామూహిక వినియోగ వస్తువులు (మాస్ కన్‌సంప్షన్) వస్తాయని ఆయన చెప్పారు.
మొదటి పన్ను స్లాబ్ ఆరు శాతం ఉండాలని మొదట భావించినా అందరూ చివరకు ఐదు శాతం ఉండాలని భావించటంతో దీనిని ఖరారు చేసినట్లు మంత్రి తెలిపారు. దీని తరువాత రెండు ప్రామాణిక పన్ను రేట్లు 12 శాతం, 18 శాతం ఉంటాయని ఆయన తెలిపారు. 18 శాతం ప్రామాణిక పన్ను రేటు ఉండాలని కొందరు సూచించారని, అయితే ప్రామాణిక పన్ను ఒకటే ఉండటం వలన ద్రవ్యోల్బణానికి దారి తీసే ప్రమాదం ఉందని, అందుకే రెండు రకాల ప్రామాణిక పన్ను రేట్లు 12, 18 శాతం నిర్ధారించామని జైట్లీ తెలిపారు.
ప్రస్తుతం చాలా లగ్జరీ వస్తువులు (వైట్ గూడ్స్)తోపాటు మరికొన్ని వస్తువులకు 12.5 శాతం పన్ను విధిస్తున్నారని, దీనికి అదనగా 14.5 శాతం వ్యాట్ విధిస్తున్నారని, ఈ రెండు కలిసి మొత్తం 26 శాతం పన్నును ఈ వస్తువులపై విధిస్తున్నారని వివరించారు. దీనికితోడు ఇతర ప్రభావాల కారణంగా ఈ వస్తువులపై చివరకు 30 నుండి 31 శాతం పన్ను విధిస్తున్నారన్నారు. జిఎస్‌టిలో దీనిని 26 శాతానికి తగ్గించాలని భావించినా చివరకు ఈ 28 శాతం పన్ను విధించాలనే ఏకాభిప్రాయం కుదిరిందని ఆయన చెప్పారు. 28 శాతం పన్ను పరిధిలోని వస్తువులను మధ్యతరగతి ప్రజలు కూడా చాలామంది ఉపయోగిస్తున్నారు కాబట్టి ఈ పరిధిలోని కొన్ని వస్తువులను ఐదు శాతం పన్ను పరిధిలోకి తెస్తామని జైట్లీ చెప్పారు. విలాసవంత వస్తువులపై జిఎస్‌టికి అదనంగా విధించే సెస్, క్లీన్ ఎనర్జీ సెస్ మూలంగా వచ్చే ఆదాయాన్ని జిఎస్‌టిని అమలు చేయటం వలన ఆయా రాష్ట్రాలకు మొదటి ఐదు సంవత్సరాల్లో వచ్చే నష్టాన్ని భర్తీ చేసేందుకు చెల్లిస్తారని జైట్లీ తెలిపారు. ఐదు సంవత్సరాల తరువాత ఈ సెస్సును రద్దు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. జిఎస్‌టిని అమలు చేయటం వలన రాష్ట్రాలకు తగ్గే ఆదాయాన్ని భర్తీ చేసేందుకు యాభై వేల కోట్ల రూపాయల అవసరం ఉంటుందని జైట్లీ తెలిపారు.

జిఎస్‌టి శ్లాబ్‌లు-వివరాలు
0%సామాన్యుడు ఉపయోగించే ఆహార ధాన్యాలు సహా వినియోగ దారు ధరల సూచీ బాస్కెట్ పరిధిలోని దాదాపు 50 శాతం వస్తువులకు శూన్య శాతం వడ్డీ రేటు వర్తిస్తుంది.

5% సామాన్య ప్రజలు ఉపయోగించే అధిక శాతం ప్రజలు వాడే వస్తువులపై 5 శాతం పన్ను విధిస్తారు.

12-18% జిఎస్‌టిలో స్టాండర్డ్ రేట్లుగా 12 శాతం, 18 శాతం పన్ను రేట్లు ఉంటాయి.

28% ప్రస్తుతం 30-31 శాతం పన్ను విధించే వస్తువులపై
గరిష్ఠంగా 28 శాతం పన్ను విధిస్తారు.

లగ్జరీ కార్లు, పొగాకు, ఏరియేటెడ్ కూల్‌డ్రింక్స్ లాంటి కొన్ని వస్తువులపై అధిక పన్ను శ్లాబ్‌కు అదనంగా సెస్ విధిస్తారు.