జాతీయ వార్తలు

‘పనామా పేపర్స్’పై సిట్ దర్యాప్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 4: పన్నులకు స్వర్గ్ధామమైన పనామాలోని సంస్థల్లో పెట్టుబడులు పెట్టినట్లుగా భావిస్తున్న 500 మంది భారతీయులతో కూడిన జాబితాపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దృష్టి కేంద్రీకరించింది. ‘పనామా పేపర్స్’ పేరిట లీకయిన ఈ రహస్య జాబితాలో సినీనటులు, రాజకీయవేత్తలు, వ్యాపారవేత్తలు సహా భారత్‌కు చెందిన సుమారు 500 మంది ప్రముఖులున్నారు. వెలుగులోకి వచ్చిన ఈ రహస్య జాబితాపై సమగ్రంగా దర్యాప్తు చేస్తామని సిట్ చైర్మన్ జస్టిస్ (రిటైర్డ్) ఎం.బి.షా ఒక వార్తా సంస్థకు చెప్పారు. ఈ జాబితాలోని పేర్ల గురించి సిట్ వద్ద ఏమైనా సమాచారం ఉందా? అని ప్రశ్నించగా, ఈ రోజే ఆ జాబితా తమకు అందిందని ఆయన బదులిచ్చారు. ఈ జాబితా గురించి ఇంతకుముందు తమకు తెలియదని, ఇప్పుడే ఆ సమాచారం తమకు చేరిందని ఆయన వివరించారు. ఈ జాబితాను మదింపు వేసి ఒక నివేదికను తయారు చేయాల్సిందిగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, ఐటి డిపార్ట్‌మెంట్, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వంటి సంస్థలను కోరినట్లు సిట్ వైస్ చైర్మన్ జస్టిస్ (రిటైర్డ్) అరిజిత్ పసాయత్ తెలిపారు. ‘దీని వెనుక ఉన్న వాస్తవం ఏంటో తెలుసుకోవాలని అనుకుంటున్నాము. సిట్ వద్ద దీనికి సంబంధించిన సమాచారం లేదు. బహుశా, దర్యాప్తు సంస్థల వద్ద ఉందేమో. అందువల్ల ఆ సంస్థలు ఒకసారి తమకు నివేదిక సమర్పిస్తే, అనంతరం మేము అవసరమైన చర్యలు తీసుకుంటాం’ అని పసాయత్ పేర్కొన్నారు.
భారతీయులు 1977-2015 మధ్య కాలంలో విదేశాలలో పెట్టిన పెట్టుబడులను భారత్‌సహా వివిధ దేశాలలో గల వార్తా పత్రికలతో కలిసి ఇంటర్నేషనల్ కన్సార్టియం ఆఫ్ ఇనె్వస్టిగేటివ్ జర్నలిజం (ఐసిఐజె) ఈ జాబితాలో బయటపెట్టింది. ఐసిఐజె గతంలో ‘స్విస్ లీక్స్’, హెచ్‌ఎస్‌బిసిలో భారతీయుల ఖాతాల వివరాలను వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే. భారత్‌కు చెందిన రాజకీయ నేతలు, నేరస్థులు, సెలబ్రిటీలు సంపన్నులకు స్వర్గ్ధామమైన పనామాలోని వివిధ సంస్థల్లో పెట్టిన రహస్య పెట్టుబడులను వెల్లడించే వేలాది డాక్యుమెంట్లు తన వద్ద ఉన్నాయని ఐసిఐజె ప్రకటించింది.
జర్మన్ వార్తాపత్రిక సుడ్డెట్‌స్కె జెయిటుంగ్ నుంచి పనామా పేపర్స్ ఫైల్స్‌తో కూడిన 2.6 టెరాబైట్స్ డాటాను ఐసిఐజె, వందకు పైగా మీడియా భాగస్వాములు తీసుకున్నాయి. ‘ఐసిఐజె మే తొలినాళ్లలో కంపెనీల వివరాలు, వాటితో సంబంధం ఉన్న వ్యక్తుల పూర్తి జాబితాను విడుదల చేస్తుంది’ అని ఆ సంస్థ తన వెబ్‌పోర్టల్‌లో పేర్కొంది.
సిట్ ఆదేశాలతో ఐటి డిపార్ట్‌మెంట్ పనామా పేపర్స్‌కు సంబంధించిన వార్తాకథనాలపై దృష్టి సారించినట్లు తెలిసింది. డాటా సిట్‌కు అందిన తరువాత ఇతర ఏజెన్సీలు కూడా రంగంలోకి దిగుతాయని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అయితే ఇప్పుడు వెలువడిన జాబితాలోని కొన్ని సంస్థలపై ఇడి, ఐటి డిపార్ట్‌మెంట్ దర్యాప్తు ఇదివరకే జరిపాయని ఆ వర్గాలు వివరించాయి. చట్టబద్ధంగా వెలుగులోకి వచ్చిన అంశాలు, నిఘా సంస్థల నుంచి అందిన సమాచారం ఆధారంగా ఇడి, ఐటి శాఖలు దర్యాప్తు చేసినట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి.