జాతీయ వార్తలు

శ్రీనగర్‌లో మళ్లీ ఘర్షణలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, నవంబర్ 5: జమ్మూకాశ్మీర్‌లో ఓ టీనేజర్ మృతి ఘర్షణకు దారితీసింది. శ్రీనగర్ పట్టణంలోని ఈద్గా ప్రాంతంలో నిరసనకారులు, భద్రతాదళాల మధ్య శనివారం నాటి ఘర్షణల్లో 12 మంది గాయపడ్డారు. గత నెల 25న అదృశ్యమైన 16 ఏళ్ల ఖైసర్ సోఫి అపస్మారక స్థితిలో పడి ఉండగా షాలిమార్ ప్రాంతంలో కనుగొన్నారు. ఆరు రోజుల క్రితం ఇది జరిగింది, సోఫిని ఆసుపత్రికి తరలించగా శనివారం ఉదయం మృతిచెందాడు. మృతదేహాన్ని ఖననం చేసి వస్తూ కొందరు యువకులు భద్రతాసిబ్బందిపై రాళ్లతో దాడి చేశారు. ఇరువురి మధ్య జరిగిన ఘర్షణల్లో 12 మంది గాయపడ్డారు. ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయని పోలీసులు వెల్లడించారు. విషప్రయోగం వల్లే యువకుడు మృతి చెందాడని ఆందోళనకారులు ఆరోపించారు. భద్రతా సిబ్బందే సోఫిపై విషప్రయోగం చేశారని స్థానికులు పేర్కొన్నారు. మరోపక్క వేర్పాటువాదుల సమ్మె పిలుపుతో కాశ్మీర్ లోయలో పౌర జీవనం అస్తవ్యస్తమైంది. 120 రోజూ పరిస్థితిలో మార్పులేదు. దుకాణాలు, వాణిజ్య సంస్థలు, పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. శ్రీనగర్‌లోని సివిల్‌లైన్స్, శివారు ప్రాంతాల్లో మాత్రం కొన్నిచోట్ల షాపులు తెరిచారు. కాశ్మీర్‌లోయలో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులు తిరగలేదు. ఆటోలు, టాక్సీలు కొన్ని ప్రాంతాల్లో నడిచాయి. హిజ్బుల్ మిలిటెంట్ బుర్హాన్ వనీ ఎన్‌కౌంటర్‌కు నిరసనగా వేర్పాటువాదులు నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. ఈ నెల 10న వేర్పాటువాదుల సమ్మె దృష్ట్యా 144 సెక్షన్ కింద నిషేధాజ్ఞలు విధించినట్టు పోలీసులు వెల్లడించారు. శాంతి భద్రతల విషయంలో రాజీపడేది లేదని, సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించినట్టు అధికారులు తెలిపారు. వనీ ఎన్‌కౌంటర్ తరువాత జరిగిన అల్లర్లలో 85 మంది మృతి చెందారు. ఇద్దరు పోలీసులు చనిపోయారు. వేలాది మంది గాయపడ్డారు. ఘర్షణల్లో 5000 మంది భద్రతాసిబ్బంది గాయపడ్డారని వారన్నారు.

చిత్రం.. శ్రీనగర్‌లో శనివారం బాలుడి శవయాత్రలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ఇస్తున్న ఆందోళనకారులు