జాతీయ వార్తలు

కాళేశ్వరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 21: తెలంగాణ రాష్ట్రంలో గోదావరి నదిపై నిర్మించే కాళేశ్వరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని కేంద్ర జలవనరులు, నదుల అభివృద్ధి శాఖ మంత్రి ఉమా భారతికి కేంద్ర మంత్రి దత్తాత్రేయ విజ్ఞప్తి చేశారు. గోదావరి నుంచి ప్రతి సంవత్సరం వృధాగా 1600 టిఎంసిల నీరు సముద్రంలో కలుస్తోందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో 350 టిఎంసిల నీటిని నిల్వ చేసుకునే వీలుంటుందని దత్తాత్రేయ చెప్పారు. ప్రాజెక్టు దిగువన చిన్న డ్యామ్‌ల నిర్మాణం ద్యారా 90 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని అన్నారు. ఈ ప్రాజెక్టు మూలంగా తెలంగాణలో గ్రామగ్రామానికీ నీటి సరఫరా అవుతుందని ఆయన వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై దత్తాత్రేయ తనతో చర్చించారని, ఈ ప్రాజెక్టును పరిశీలించాడనికి జల వనరుల మంత్రిత్వ శాఖ అధికారులను కాళేశ్వరం పంపించి పూర్తి వివరాలు తెలుసుకుంటానని, నివేదిక వచ్చాక నిర్ణయం తీసుకుంటామని ఉమాభారతి అన్నారు. వచ్చే పార్లమెంట్ సమావేశాలు ప్రారంమయ్యే లోపు తెలంగాణ రాష్ట్రంలోని నీటి ప్రాజెక్టులను పరిశీలించేదుకు ఆ రాష్ట్రంలో పర్యటిస్తానని ఆమె చెప్పారు. ఉమాభారతిని కలిసినవారిలో దత్తాత్రేయతోపాటు బాలసుబ్రమణ్యం తదితరులున్నారు.