జాతీయ వార్తలు

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ముప్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రేణిగుంట, నవంబర్ 7: తిరుపతి నుంచి హైదరాబాద్ మీదుగా ఢిల్లీ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానానికి సోమవారం పెనుప్రమాదం తప్పిన సంఘటన రేణిగుంట విమానాశ్రయంలో చోటుచేసుకుంది. మరికొద్ది సేపట్లో రన్‌వేపైకి వెళ్లాల్సిన విమానం వెనుకచక్రంలోపూర్తిగా గాలితగ్గిపోవడంతో ఒక పక్కకు ఒరిగింది. దీంతో విమానంలో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. అయితే అప్పటికే విమానం బయలుదేరడానికి ముందు తనిఖీలుచేసిన అధికారులు వెనుకచక్రం పంచరైన విషయాన్ని గుర్తించి ప్రయాణికులకు ధైర్యంచెప్పారు. టైర్‌లో గాలి లేని విషయాన్ని గుర్తించకుండాపోయుంటే పెనుప్రమాదం జరిగి ఉండేదని ప్రయణికులు అన్నారు. దీంతో మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరాల్సిన విమానం నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అయితే విమానాశ్రయం అధికారులు తక్షణం చెన్నైనుంచి కొత్త టైర్లు తెప్పించి అమర్చారు. సాయంత్రం 6 గంటలకు అదేవిమానం బయలుదేరి వెళ్లింది. అయితే విమానం టైరు పేలిపోయిందనే ప్రచారాలు విస్తృతంగా సాగాయి. అయితే ఇది వాస్తవం కాదని విమానశాఖాధికారులు విలేఖరులకు వివరణ ఇచ్చారు.