జాతీయ వార్తలు

ఎన్డీటివీపై నిషేధం అప్రజాస్వామికం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 7: పఠాన్‌కోట్‌పై ఇస్లామిక్ ఉగ్రవాదులు దాడి జరిపినప్పుడు దేశ భద్రతకు సంబంధించిన అంశాలను ప్రసారం చేసిందంటూ ఎన్‌డిటివి హిందీ చానల్‌ను ఈ నెల 9న ఒక రోజు పాటు నిషేధిస్తూ జారీ చేసిన ఆదేశాలను కేంద్ర సమాచార శాఖ తాత్కాలికంగా నిలిపివేసింది. ఎన్‌డిటివిని నిషేధించటం అత్యవసర పరిస్థితి రోజులను గుర్తు చేస్తోందటూ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఎడిటర్ గిల్డ్ దుయ్యబట్టటంతోపాటు ఇతర ప్రతిపక్షాలు కూడా పెద్దఎత్తున విమర్శించటంతో ప్రభుత్వం దిగి రాక తప్పలేదని అంటున్నారు. సమాజంలోని అన్ని వర్గాల నుండి విమర్శలు రావటంతో కేంద్ర ప్రభుత్వం ఒక రోజు నిషేధం ఆదేశాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. ఇదిలా ఉంటే ఎన్‌డిటివి అధినేత ప్రణయ్ రాయ్ సోమవారం ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయటంతో పాటు కేంద్ర సమాచార శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడును కలిసి చర్చలు జరిపారు. ఈ కేసును సుప్రీం కోర్టు మంగళవారం విచారణ చేపట్టనుంది. ప్రణయ్‌రాయ్ వివరణ ఇచ్చిన అనంతరం టివి ప్రసారాలపై విధించిన ఒక రోజు నిషేధాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించినట్లు సమాచార శాఖ అధికారులు ప్రకటించారు. ఇదిలా ఉంటే పఠాన్‌కోట్ దాడి గురించి అన్ని టి.విలు వార్తలు ప్రసారం చేసినప్పుడు కేవలం ఎన్.డి.టి.విపై నిషేధం విధించటం ఏమిటని ఎడిటర్స్ గిల్డ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ప్రభుత్వ నిర్ణయం ఎనర్జెన్సీ రోజులను గుర్తు చేస్తోందని గిల్డ్ ఆందోళన వ్యక్తం చేసింది. టి.వి. ప్రసారాలను నిలిపివేయటం ద్వారా ఎన్.డి.ఏ ప్రభుత్వం మీడియా వ్యవహారాల్లో జోక్యం చేసుకునేందుకు ప్రయత్నిస్తోందని గిల్డ్ ఆరోపించింది. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా ఎన్.డి.టి.వి హిందీ చానల్ ప్రసారాలను ఒక రోజు నిషేదించటం పట్ల తీవ్రం స్పందించారు. ఎన్.డి.ఏ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ప్రజాస్వామ్యానికి చీకటి రోజులని ఆయన అభివర్ణించారు.