ఆంధ్రప్రదేశ్‌

బొగ్గు కుంభకోణంలో రుంగ్టాలకు జైలుశిక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 4: బొగ్గు కుంభకోణంలో ఝార్ఖండ్ ఇస్పాట్ ప్రైవేట్ లిమిటెడ్ (జెఐపిఎల్) డైరెక్టర్లు ఆర్‌ఎస్ రుంగ్టా, ఆర్‌సి రుంగ్టాలకు నాలుగేళ్ల చొప్పున జైలు శిక్ష విధిస్తూ ప్రత్యేక కోర్టు సోమవారం తీర్పు చెప్పింది. కోర్టు వీరిద్దరికి రూ. అయిదు లక్షల చొప్పున జరిమానా విధించింది. జెఐపిల్‌కు రూ. 25 లక్షల జరిమానా విధించింది. అంతకుముందు ప్రత్యేక సిబిఐ న్యాయమూర్తి భరత్ పరాశర్ ముందు సిబిఐ తన వాదన వినిపిస్తూ దోషులయిన జెఐపిఎల్, దాని డైరెక్టర్లు ఆర్‌ఎస్ రుంగ్టా, ఆర్‌సి రుంగ్టా ఉద్దేశపూరితంగా ఆర్థిక నేరాలకు పాల్పడడం జరిగిందని, అం దువల్ల వారికి గరిష్ఠంగా శిక్ష విధించాలని కోరింది. జెఐపిఎల్‌ను, దాని ఇద్దరు డైరెక్టర్లను దోషులుగా నిర్ధారిస్తూ ప్రత్యేక కోర్టు మార్చి 28న తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే.