జాతీయ వార్తలు

శిరోధార్యం కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 13: జపాన్‌తో ఇటీవల కుదుర్చుకున్న చరిత్రాత్మక పౌర అణు ఒప్పందంలోని ‘రద్దు’ నిబంధన భారత్‌కు శిరోధార్యం ఏమీ కాదని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. అయితే జపాన్ తీసుకున్న ప్రత్యేక జాగ్రత్తలో భాగంగా ఈ నిబంధనను పొందుపరచడం జరిగిందని అధికార వర్గాలు ఇక్కడ తెలిపాయి. అమెరికా, ఇతర దేశాలతో భారత్ చేసుకున్న పౌర అణు ఒప్పందాల కన్నా అదనంగా ఎలాంటి వాగ్దానాలను జపాన్‌తో కుదుర్చుకున్న ఒప్పందంలో భారత్ చేయలేదని ఆ వర్గాలు వివరించాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ, జపాన్ ప్రధాని షింజో అబే సమక్షంలో శుక్రవారం టోక్యోలో ఇరు దేశాలు సంతకాలు చేసిన అణు సహకార ఒప్పందంలో ‘దృక్పథాలు, అవగాహన’ అనే ఒక నోట్ ఉంది. భారత్ 2008 సెప్టెంబర్‌లో అణు పరీక్షలపై ఏకపక్షంగా, స్వచ్ఛందంగా మారటోరియం విధించుకుందని పేర్కొంటూ, ఈ హామీని ఉల్లంఘిస్తే ఒప్పందం రద్దవుతుందని జపాన్ ఈ నోట్‌లో పేర్కొంది.