జాతీయ వార్తలు

మూడురోజుల్లో 30వేల కోట్లు పంపిణీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, నవంబర్ 13: పెద్ద నోట్లు రద్దయినప్పటి నుంచి ఆదివారం సాయంత్రం పొద్దుపోయేవరకు 30వేల కోట్ల రూపాయలను బ్యాంకులు వినియోగదారులకు అందించాయి. దేశంలోని బ్యాంకుల వ్యవస్థ ప్రజావసరాలకు తగ్గట్టుగా అన్ని విభాగాలను ముమ్మరంగా పనిచేయించడంతో కొన్ని లోటుపాట్లున్నా నగదు పంపిణీ చురుగ్గా సాగిందని భారత బ్యాంకుల సంఘం ఓ ప్రకటనలో తెలిపింది. ముఖ్యంగా ఈ నెల 10వ తేదీ నుంచి తగిన గుర్తింపు కార్డుతో నాలుగువేల రూపాయలను పాతనోట్లతో మార్చుకునే అవకాశాన్ని కల్పించిందని, ఈ విధంగా కూడా భారీగానే నగదు పంపిణీ జరిగిందని తెలిపింది. అయితే కేవలం బ్యాంకుల నుంచి తీసుకునే నగదుపైనే ఆధారపడకుండా తమ చెల్లింపులను ఎలాంటి ఇబ్బంది లేకుండా డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా చేసుకోవాలని కోరింది.

చిత్రం.. పెద్దనోట్ల రద్దుతో నల్లధనం చెత్తకుప్పల పాలవుతోంది. కోల్‌కతాలో గోల్ఫ్ క్లబ్
రోడ్డులోని ఓ చెత్తకుప్పలో చించిపడేసిన 500, వెయ్య రూపాయల నోట్లు