జాతీయ వార్తలు

స్టే ఇవ్వని సుప్రీం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 15:చెలామణి నుంచి 500, 1000 నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయాన్ని నిలిపివేయడానికి సుప్రీం కోర్టు నిరాకరించింది. దైనందిన అవసరాలకే నగదు లేక వారం రోజులుగా దురవస్థలు పడుతున్న సామాన్యుల ఇబ్బందులు తక్షణమే తీర్చాలని కేంద్రాన్ని ఆదేశించింది. ‘నల్లధనంపై లక్షిత దాడులు చేయండి కానీ..సామాన్యులపై సర్జికల్ దాడులు తగవు’అంటూ ప్రధాన న్యాయమూర్తి టిఎస్ ఠాకూర్, జస్టీస్ చంద్రచూడ్‌లతో కూడిన సుప్రీం బెంచి విచారణ సందర్భంగా కేంద్రానికి తేల్చిచెప్పింది. కేంద్ర చర్యను సవాలు చేస్తూ దాఖలైన నాలుగు ప్రజాహిత పిటిషన్ల విచారణను ముగిస్తూ తదుపరి విచారణను 25కు వాయిదా వేసింది. దేశ వ్యాప్తంగా నగదు కోసం అన్ని ఎటిఎమ్‌లు, బ్యాంకుల వద్ద వందలదాదిగా గంటల తరబడి క్యూల్లో నిలబడుతున్న వారి పరిస్థితి మాటేమిటని ప్రశ్నించింది. కార్పెంటర్లు, కూరగాయల వర్తకులు సహా అన్ని రకాలుగా చిన్న వ్యాపారులు నగదుపైనే ఆధారపడతారని, వారి అవస్థలను తీర్చగలుగుతారా అని గట్టిగా కేంద్రాన్ని ప్రశ్నించింది. నల్లధనాన్ని నిర్మూలించడమే ప్రభుత్వ లక్ష్యమైనప్పటికీ దీని వల్ల సామాన్యుల జీవితాలు దుర్బరమవుతున్నాయని న్యాయమూర్తులు పేర్కొన్నారు. మీరు (కేంద్రం) ఈ చర్యను నల్లధనంపై చేపట్టిన లక్షిత దాడులంటున్నారు. కపిల్ సిబల్ (పిటిషనర్ తరపు న్యాయవాది) దీన్ని మూకుమ్మడి బాంబింగ్ అంటున్నారు’అని పేర్కొన్న న్యాయమూర్తులు ‘ఇలాంటి చర్యలను నల్లధనాన్ని దాచుకున్న వారినే లక్ష్యంగా చేసుకుని జరగాలి’అని ఉద్ఘాటించారు. నల్లధనాన్ని సమూలంగా నిర్మూలించడం అన్నది అభినందనీయ చర్యేనని అయితే..దీని కారణంగా సామాన్యులు అనుభిస్తున్న కష్ట నష్టాలను తొలగించే ప్రయత్నాలు ముమ్మర ప్రాతిపదికన చేపట్టాలి’అని స్పష్టం చేశారు. నగదు విత్‌డ్రావల్స్ పరిమితిని పెంచాలని సూచించిన సుప్రీం కోర్టు ‘సామాన్యులు రోజువారీగా క్యూల్లో గంటల తరబడి నిలబడాల్సిన అవసరం లేకుండా ఈ చర్యను ఎందుకు తీసుకోకూడదు’అని ప్రశ్నించింది. తన వాదన వినిపించిన కేంద్రం దేశ వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితిని ఎప్పటికప్పుడు అత్యున్నత స్థాయిలో సమీక్షిస్తున్నామని స్పష్టం చేసింది. అలాగే కరెంట్ అకౌంట్ ఖాతాదారులకు వారానికి 50వేలు తీసుకునేందుకు అనుమతించామని, ఈ సౌకర్యాన్ని అన్ని కంపెనీలకు వర్తింపజేస్తామని తెలిపింది. పెద్ద నోట్ల రద్దుపై కేంద్రం, ఆర్‌బిఐకి ఎలాంటి నోటీసులు జారీ చేయకపోయినా ఇప్పటి వరకూ తీసుకున్న చర్యలను, భవిష్యత్‌లో సామాన్యుల అవస్థలు తగ్గించేందుకు ఎలా వ్యవహరించబోతన్నారో వివరిస్తూ సమగ్ర అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రాన్ని కోరింది. కేంద్రం తరపున వాదించిన అటార్నీ జనరల్ ముకుల్ రోహద్గీ పెద్ద నోట్ల రద్దును గట్టిగా సమర్థించారు. గత ఐదు దశాబ్దాల కాలంలో వచ్చిన ఏ ప్రభుత్వమూ చేయలేని పనిని కేంద్రం చేపట్టిందని తెలిపారు. కాగా, నోట్ల రద్దు విషయంలో తలెత్తుతున్న ఇబ్బందులను తొలగించేందుకు అన్ని వర్గాల సూచనలు, సలహాలు తీసుకోవాలని కేంద్రానికి, ఆర్‌బిఐకి సుప్రీం బెంచి విజ్ఞప్తి చేసింది.