జాతీయ వార్తలు

బిజెపి వర్గాలకు ముందే ‘ఉప్పు’!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, నవంబర్ 15: నగదు కోసం బ్యాంకులు, ఎటిఎమ్‌ల వద్ద గంటల తరబడి క్యూల్లో నిలబడి ఇప్పటి వరకూ 18మందినుంచి 20మంది వరకూ చనిపోతే ప్రధాని నరేంద్ర మోదీ ‘నవ్వుతున్నా’రంటూ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. ఎలాంటి ఔచిత్యం, సహేతుకత లేని నిర్ణయంగా 500, 1000 నోట్ల రద్దుపై రాహుల్ విరుచుకు పడ్డారు. ‘అసలు మోదీ నవ్వుతున్నారో..కన్నీరు కారుస్తున్నారో వివరించాలి’అని అన్నారు. గోవా, జపాన్‌లలో మోదీ చేసిన ప్రసంగాన్ని ఆయన పరోక్షంగా ప్రస్తావించారు. నోట్ల రద్దు గురించి బిజెపి వర్గాలకు ముందే ఉప్పందిందని పేర్కొన్న రాహుల్ ‘..లేని పక్షంలో నోట్ల రద్దు నిర్ణయానికి ముందే పశ్చిమ బెంగాల్‌లో బిజెపి నేతలు కోట్లాది రూపాయలు ఎలా డిపాజిట్ చేయగలుగుతారు’అని ప్రశ్నించారు. దీనిపై బిజెపి అధినాయకత్వం ఇచ్చే వివరణ ఏమిటని ప్రశ్నించారు. మోదీ ప్రకటనకు ముందే 2వేల నోట్ల కట్టలను బిజెపి నేతలు చూపిస్తున్నట్టుగా ఇంటర్‌నెట్‌లో ఫొటోలు ఉన్నాయని ఇక్కడి బాంద్రాలో మంగళవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత మీడియా భేటీలో రాహుల్ గుర్తు చేశారు. మోదీ తీసుకున్న ఈ నిర్ణయం ఓ పెద్ద కుంభకోణమే అవుతుందన్నారు. అసలు నోట్ల రద్దు గురించి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి చివరి వరకూ ఏమీ తెలియదని అన్నారు. కేవలం రాజకీయ లెక్కల ప్రాతిపదికగానే మోదీ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ఆర్థిక వేత్తలు విశే్లషిస్తున్నారని అన్నారు. నల్ల కుబేరులపై చర్యలు తీసుకుంటున్న దాఖలాలు ఏమీ కనిపించడం లేదని..నెలల తరబడి రైతులు, కార్మికులను కనీస అవసరాల కోసం రోజుల తరబడి క్యూల్లో నిలబెట్టడం సమంజసం కాదన్నారు.