జాతీయ వార్తలు

ఐఐటిల ఫీజు 122 శాతం పెంపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 7: దేశంలోని ఐఐటిల ఫీజులను కేంద్రం అమాంతం 122 శాతం పెంచింది. దాంతో యుజి కోర్సులకు ఏటా 90 వేలు ఉన్న ఫీజు ఇక మీదట రెండు లక్షలు కాబోతోంది. దీనివల్ల మధ్య తరగతి విద్యార్ధులపై విపరీతమైన భారం పడనుంది. అయితే పెంచిన ఫీజు ఐఐటిల్లో చదువులకు ఇంకా తక్కువేనని మానవ వనరుల మంత్రిత్వశాఖ అధికారులు చెబుతున్నారు. పిజి కోర్సుల ఫీజు వ్యవహారం ఇంకా తేల్చలేదు. త్వరలో ఆ నిర్ణయం కూడా తీసుకుంటారని తెలిసింది. ఐఐటి రూర్కీ చైర్మన్ అశోక్ మిశ్రా నేతృత్వంలోని ఐఐటి కౌన్సిల్ గత పక్షం ఫీజులను 90 వేల నుండి మూడు లక్షలకు పెంచాలని సూచించింది. రానున్న రోజుల్లో పెరిగిన ఫీజు 23 ఐఐటిల్లో అమలులోకి రానుంది.
అంతర్జాతీయంగా ర్యాంకింగ్‌లు పొందుతున్న భారతీయ ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశాలకు ఏకీకృత పరీక్ష ‘నేషనల్ అధారిటీ ఆఫ్ టెస్టు’ (ఎన్‌ఎటి) నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. అంతా అనుకున్నట్టు జరిగితే ఇది వచ్చే ఏడాది నుండి అమలులోకి వస్తుంది. అమెరికాలో కాలేజీబోర్డు ఆధ్వర్యంలో శాట్ పరీక్ష, అలాగే జిఆర్‌ఇ, టోఫెల్ పరీక్షల మెరిట్ ద్వారా అమెరికా, యుకె, కెనడా, ఇతర మధ్య ప్రాచ్య దేశాల్లో అడ్మిషన్లను ఇస్తున్నారు. అదే రీతిన భారత్‌లోనూ ఐఐటిలు, ఎన్‌ఐటిలు, ఐఐఎంలు, ట్రిపుల్ ఐటిలు, డీమ్డ్ వర్శిటీలు, ఉన్నత స్థాయి జాతీయ సంస్థల్లో అడ్మిషన్లకు నేషనల్ అథారిటీ ఒక ఉమ్మడి ప్రవేశ పరీక్షను నిర్వహించనుంది. ప్రస్తుతం ఐఐటిల్లో ప్రవేశానికి ఐఐటి జెఇఇ మెయిన్, అడ్వాన్స్‌డ్ పరీక్షలను నిర్వహిస్తున్నారు. వీటికి తోడు ఇంజనీరింగ్ అండర్ గ్రాడ్యూయేట్ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్ధులు నేడు డజనుకు పైగా వేర్వేరు ప్రవేశపరీక్షలు రాయాల్సి వస్తోంది. వివిధ రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఉమ్మడి ప్రవేశపరీక్షలను నిర్వహిస్తున్నారు. తద్వారా చిన్న రాష్ట్రాల్లో ప్రవేశపరీక్షల నిర్వహణ ఆయా ప్రభుత్వాలకు తలనొప్పిగానూ, భారంగానూ పరిణమించాయి. ఆర్ధికలోటుతో పరీక్షల నిర్వహణ , కౌనె్సలింగ్ తదితర ప్రక్రియకు కాలం కూడా వృధా అవుతోంది. దీంతో గత ఏడాది నుండి 8 రాష్ట్రాల్లో అడ్మిషన్లను ఐఐటి జెఇఇ మెయిన్ పరీక్ష ర్యాంకింగ్ ఆధారంగానే జరుగుతోంది. కొన్ని ప్రైవేటు కాలేజీల్లో యాజమాన్య సీట్ల మెరిట్‌కు సైతం ఐఐటి జెఇఇ ర్యాంకింగ్‌ను పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఈ క్రమంలో విద్యార్ధులపై ప్రవేశపరీక్షల భారాన్ని తగ్గించి ఒకే పరీక్షను జిఆర్‌ఇ తరహాలో నిర్వహించి దాని ర్యాంకు ఆధారంగానే జాతీయ స్థాయిలో అడ్మిషన్లను చేపట్టేందుకు కేంద్రప్రభుత్వం పూనుకుంది. దీనిపై వివిధ వర్గాల అభిప్రాయాలను సైతం సేకరిస్తోంది. విద్యావేత్తలు, విమర్శకులు, యాజమాన్యాలు, విద్యార్ధి సంఘాల నేతలు అభిప్రాయాలను తీసుకున్న తర్వాత తుది నిర్ణయానికి కేంద్రం రానుంది. కాగా ఇప్పటికే ఈ అంశాన్ని ఐఐటి కౌన్సిల్ సమావేశంలో చర్చించగా, కౌన్సిల్ సభ్యులు దీనిపై ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తూ ప్రభుత్వ సూచనను స్వాగతించారు.
ఐఐటి ఫీజుల మాఫీ
ఎస్సీ, ఎస్టీలు లక్షలోపు వార్షికాదాయం ఉన్న వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్ధులకు ఐఐటిల్లో ఫీజును పూర్తిగా మాఫీ చేయాలని నిర్ణయించింది. ఐఐటి ప్యానల్ ప్రతిపాదన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు మానవ వనరుల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. నాణ్యత, వౌలిక సదుపాయాల కల్పన కోసం నిధులు అవసరం ఉందని పేర్కొన్న కేంద్రం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.