జాతీయ వార్తలు

ఏ ఎటిఎంలో ఎంత నగదు ఉంది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 15: దేశంలో వ్యక్తిగత ఫైనాన్స్ మేనేజిమెంట్ యాప్ వాల్‌నట్ సరికొత్త ఫీచర్‌ను ఆవిష్కరించింది. వినియోగదారులు తమకు దగ్గరలో పనిచేస్తున్న నగదుతో కూడిన ఎటిఎంలను కనుగొనేందుకు ఈయాప్ ఉపయోగపడుతుందని వాల్‌నట్ సిఇవో అమిత్ బోర్ తెలిపారు. వాల్‌నట్ 1.8 మిలియన్లకుపైగా ఉన్న తమ వినియోగదారులకు ఎటిఎంను వినియోగాన్ని పరిగణనలోకి తీసుకుని ఎటిఎంలను కనుగొనడంలో సహాయపడుతుంది. ఈ వినియోగదారునికి ఎటిఎం వల్ల క్యూ స్థితిని గురించి తెలపాల్సిందిగా సందేశం అడుగుతుందన్నారు. ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులు తమ సహచర భారతీయులకు ఈ సమాచారాన్ని వాట్సప్, సోషల్ మీడియా ద్వారా ప్లాట్‌ఫామ్స్ అయిన ఫేస్‌బుక్, ట్విట్టర్ మొదలైన వాటి ద్వారా అందించవచ్చన్నారు. నగదు కలిగిన ఎటిఎంల వద్ద స్వల్ప క్యూ ఉంటే దానిని గ్రీన్ పిన్‌తో సూచిస్తారన్నారు. నగదు కలిగిన ఎటిఎంలు వద్ద భారీ క్యూ కలిగి ఉంటే దానిని రెడ్ పిన్‌తో సూచిస్తారు. నగదు లేని ఎలాంటి యాక్టివిటీ లేని ఎటిఎంల స్థితిని గ్రే పిన్‌తో సూచిస్తారు.