జాతీయ వార్తలు

పెద్ద నోట్ల రద్దుతో జనాన్ని బిచ్చగాళ్లుగా మార్చారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, నవంబర్ 15: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దుచేసి దేశ ప్రజలను బిచ్చగాళ్లులా మార్చిందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ మంగళవారం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇతర పార్టీలు తనతో చేతులు కలిపినా, కలపకపోయినా ఈ విషయంపై బుధవారం రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీని కలుసుకుంటానని ఆమె స్పష్టం చేశారు. ‘పెద్ద నోట్ల రద్దు విషయమై బుధవారం మా పార్టీకి చెందిన 40 మంది ఎంపీలతో రాష్టప్రతిని కలుసుకుంటా. ఈ అంశం గురించి ఇప్పటికే రాహుల్ గాంధీ, నితీశ్ కుమార్, నవీన్ పట్నాయక్, ములాయం సింగ్ యాదవ్, అరవింద్ కేజ్రీవాల్ తదితర వివిధ పార్టీల నాయకులతో మాట్లాడా. వారంతా నాతో చేతులు కలపాలనుకుంటే మంచిదే. లేకపోయినా నేను మా పార్టీ ఎంపీలతో కలసి రాష్టప్రతి వద్దకు వెళ్తా’ అని మంగళవారం ఆమె న్యూఢిల్లీకి బయలుదేరే ముందు కోల్‌కతా విమానాశ్రయంలో విలేఖరులకు తెలిపారు. పెద్ద నోట్ల రద్దుపై మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తేందుకు నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు, జమ్మూ-కాశ్మీరు మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తనతో చేతులు కలుపుతారని భావిస్తున్నట్లు ఆమె చెప్పారు. ఈ అంశంపై ఇప్పుడే రాష్టప్రతిని కలవడం తొందరపాటు అవుతుందని కొన్ని రాజకీయ పార్టీల నాయకులు చేస్తున్న వ్యాఖ్యల గురించి విలేఖరులు ప్రశ్నించగా, ‘అది వారి అభిప్రాయం. రోగి చనిపోకముందే వైద్యుడిని సంప్రదించాలి. అంతేతప్ప రోగి మరణించిన తర్వాత వైద్యుడి వద్దకు వెళ్తే ఎటువంటి ప్రయోజనం ఉండదు. అందుకే పెద్ద నోట్ల రద్దు విషయమై ఇప్పుడే రాష్టప్రతి వద్దకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ అంశంపై నాతోపాటు ఇతర పార్టీలు కూడా రాష్టప్రతిని కలుసుకోవాలని కోరుతున్నా’ అని మమతా బెనర్జీ తెలిపారు.