జాతీయ వార్తలు

బేషరతుగా క్షమాపణ చెప్పండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 17: బులంద్‌శహర్ గ్యాంగ్ రేప్ సంఘటనను రాజకీయ కుట్రగా అభివర్ణించింనందుకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని సుప్రీంకోర్టు ఉత్తరప్రదేశ్ మంత్రి ఆజమ్‌ఖాన్‌ను గురువారం ఆదేశించింది. అంతేకాక రేప్‌లు, అత్యాచారం లాంటి కేసుల్లో ప్రజా ప్రతినిధులు చేసే వ్యాఖ్యల విషయంలో అటార్నీ జనరల్ సాయాన్ని సైతం కోర్టు కోరింది. కాగా, గ్యాంగ్ రేప్ బాధితురాలిని దగ్గర్లోని సైనిక్ స్కూల్లో చేర్పించేందుకు చర్యలు తీసుకోవాలని న్యాయమూర్తులు దీపక్ మిశ్రా, సి.నాగప్పన్‌లతో కూడిన బెంచ్ అఖిలేష్ యాదవ్ ప్రభుత్వాన్ని కోరింది. సెంట్రల్ స్కూల్లో బాధితురాలు చేరడానికి, ఆమె చదువుకు అయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని కూడా కోర్టు ఆదేశించింది. గత జూలై 29న నోయిడాకు చెందిన ఒక కుటుంబం కారులో వెళుతుండగా ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌శహర్ వద్ద కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు అడ్డగించి కారులో ఉన్న వాళ్లను బైటికి లాగి తల్లి, కుమార్తెలపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ సంగతి తెలిసిందే. అయితే ఈ సంఘటనను అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాది ప్రభుత్వాన్ని అప్రతిష్ఠ పాలు చేయడానికి పన్నిన రాజకీయ కుట్ర అని రాష్ట్ర మంత్రి ఆజంఖాన్ వ్యాఖ్యానించారు. దీనిపై ఆగ్రహించిన బాధిత వ్యక్తి ఖాన్‌తోపాటు పలువురు పోలీసులపై ఎఫ్‌ఐర్ నమోదు చేయడంతోపాటుగా ఈ కేసును ఢిల్లీకి బదిలీ చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.