జాతీయ వార్తలు

మీకెందుకు అంత బాధ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆజమ్‌గఢ్, నవంబర్ 17: పెద్దనోట్లను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని విమర్శిస్తున్న ప్రతిపక్షాలపై బిజెపి అధ్యక్షుడు అమిత్ షా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతూ, నల్లధనం లేనివాళ్లు ఈ నిర్ణయాన్ని విమర్శించడానికి కారణమే లేదని, నల్లధనం ఉన్నందువల్లనే ప్రతిపక్షాలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయని అన్నారు. ‘మాయావతి, కాంగ్రెస్ పార్టీ, సమాజ్‌వాది పార్టీ, మమత, కేజ్రీవాల్, కమ్యూనిస్టు పార్టీలు.. అందరూ నోట్ల రద్దుపై గగ్గోలు పెడుతున్నారు. ఇందులో కుట్ర ఉందని మీరంతా ఎందుకు అంటున్నారు? జనం ముందు మీ నిజస్వరూపాన్ని ఎందుకు బైటపెట్టుకుంటున్నారు?’ అని సమాజ్‌వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ నియోజకవర్గమైన ఆజంగఢ్‌లో బిజెపి నిర్వహించిన పరివర్తన్ ర్యాలీలో మాట్లాడుతూ అమిత్ షా అన్నారు. ఈ నిర్ణయానికి మీరెందుకు బాధపడాలని ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌ను ప్రశ్నించిన అమిత్‌షా తమవద్ద నల్లధనం లేదు కాబట్టి తాము వెనక్కి వెళ్లే ప్రసక్తి లేదని, ఒక్కదెబ్బతో ప్రధాని నరేంద్ర మోదీ వెయ్యి, 500 రూపాయల నోట్లను పనికిరాని చెత్తకాగితాలుగా మార్చేశారని అన్నారు. టెర్రరిస్టులు, డ్రగ్స్ మాఫియా, నక్సలైట్లు, బ్లాక్‌మార్కెటీర్లులాంటి వారివద్ద ఉన్న సొమ్మంతా ఇప్పుడు చిత్తుకాగితాలుగా మారిపోయిందన్నారు. ‘జనం గంటలసేపు క్యూలలో నిలబడడం కష్టమే. మేముకూడా దీనికి బాధపడుతున్నాం. పెద్ద నిర్ణయాలు తీసుకున్నప్పుడు కొన్ని ఇబ్బందులుంటాయి. అయితే ఆ నిర్ణయాలవల్ల ఇతరులు సంతోషంగా ఉంటారు’ అని అమిత్‌షా అన్నారు. పెద్దనోట్ల రద్దువల్ల ద్రవ్యోల్బణం తగ్గుతుందని, బ్లాక్ మార్కెటింగ్ అదుపులోకి వస్తుందని, పాకిస్తాన్‌నుంచి వస్తున్న నకిలీ కరెన్సీ అంతా పనికి రానిదిగా మారిపోతుందన్నారు.
పెద్దనోట్ల రద్దువల్ల పెళ్లిళ్లు, పంటల సీజన్ మధ్యలో జనం ఇబ్బందులు పడుతున్నందునే ప్రధాని నరేంద్ర మోదీ పెళ్లిళ్ల కోసం రూ.2.5 లక్షలు, రైతులు రూ.50 వేల దాకా విత్‌డ్రా చేసుకోవడానికి ఈ రోజు అనుమతించారని బిజెపి అధ్యక్షుడు చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లోను దేశంలో సంపన్న రాష్ట్రంగా చేయగల ప్రభుత్వం రాష్ట్రానికి అవసరమన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి దారుణంగా ఉంది. నేరాలు పెరిగిపోతున్నాయి. సమాజ్‌వాది పార్టీ, బిఎస్పీలు రాష్ట్రాన్ని అభివృద్ది చేయలేవు.. బిజెపి ప్రభుత్వం మాత్రమే యుపిని అభివృద్ధి చేయగలదు’ అని అమిత్ షా చెప్పారు. తమ పార్టీ గనుక అధికారంలోకి వస్తే భూ మాఫియాలలో ఎవరినీ వదిలిపెట్టబోమని ఆయన అన్నారు. సమాజంలోని పేదలు, అట్టడుగు వర్గాల అభ్యున్నతికోసం మోదీ ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రారంభించిందని, అయితే ఉత్తరప్రదేశ్‌లోని అబ్బాయి-బాబాయి ప్రభుత్వం వాటిని అమలు చేయడం లేదని షా అన్నారు.