జాతీయ వార్తలు

ఆ ‘సాహసం’ బూటకమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుణె, నవంబర్ 17: ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన తొలి భారత జంటగా రికార్డు సృష్టించాలనుకున్న కానిస్టేబుళ్ల జంట ప్రయత్నం వికటించింది. మార్ఫింగ్ చేసిన ఫొటోలతో మీడియా ముందు ప్రకటించుకుని, తొలి జంటగా తమకు తాముగా ప్రకటించుకోవడంతో అందరి దృష్టిని ఆకర్షించారు. అయితే వారు ఎవరెస్టును అధిరోహించలేదని, ఆ బృందాల్లో ఈ జంట పాలుపంచుకోలేదని తేలడంతో అసలు రంగు బయటపడింది. ఇది వివాదాస్పదం అయినప్పటినుంచీ కానిస్టేబుళ్ల దంపతులు అజ్ఞాతంలోకి వెళ్లడంతో అనుమానాలు మరింత బలపడ్డాయి. దీంతో కానిస్టేబుళ్ల జంటను సస్పెండ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. పుణెలోని శివాజీనగర్ పోలీస్ ప్రధాన కార్యాలయంలో కానిస్టేబుళ్ళుగా పనిచేస్తున్న దినేష్, తారకేశ్వరి రాథోడ్ సాహస యాత్రకు బదులు దుస్సాహసం చేసి ఉద్యోగాలను పోగొట్టుకున్నారు. నేపాల్‌లో జూన్ 5వ తేదీన విలేఖరుల సమావేశంలో ఎవరెస్టును అధిరోహించిన తొలి భారతీయ జంటగా రికార్డు సృష్టించామంటూ ఫొటోలను సైతం విడుదల చేశారు. మే 23న తాము ఈ సాహస యాత్రకు పూనుకున్నామని దంపతులు ప్రకటించుకున్నారు. అయితే ఈ దంపతులు ఎవరెస్టు అధిరోహించలేదని, వారు ప్రదర్శించిన ఫొటోలు మార్ఫింగ్ చేసినవని స్థానిక పర్వతారోహకులు ప్రకటించడంతో వివాదం చెలరేగింది. అప్పటినుంచి ఈ పోలీసు దంపతులు అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో వారి సాహసయాత్ర బూటకమని స్పష్టమైంది. వీరి వ్యవహారంపై పోలీసు అధికారులు నిజనిర్ధారణ కమిటీతో విచారణ జరిపించడంతో అసలు విషయాలు వెలుగుచూశాయి. దీంతో ఉన్నతాధికారులు వారిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీచేశారు. ఈ దంపతుల సాహసయాత్రకు సంబంధించి నేపాల్ ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదని పోలీసు అధికారులు తెలిపారు.