జాతీయ వార్తలు

దద్దరిల్లిన పార్లమెంట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దుపై పార్లమెంట్ ఉభయ సభలూ గురువారం దద్దరిల్లి పోయాయి. దేశ వ్యాప్తంగా సామాన్యుల జీవితాలు వీధిన పడ్డాయంటూ విపక్షాలు రెండు సభల్లోనూ ప్రభుత్వంపై విరుచుకు పడ్డాయి. కోటానుకోట్ల మంది జీవితాలను వీధిపాలు చేసిన ఈ నిర్ణయంపై జరుగుతున్న చర్చకు హాజరై ప్రధాని మోదీ సమాధానం ఇవ్వాలని రాజ్యసభలో విపక్షాలు పట్టుబట్టాయి. అందుకు సర్కార్ నిరాకరించింది. లోక్‌సభలో కూడా ఆద్యంతం గందరగోళ పరిస్థితి నెలకొంది. సభ్యుల వాదోపవాదాల మధ్య పలుమార్లు వాయిదా పడింది. కేవలం ప్రశ్నోత్తరాల సమయంలోనే..అదీ ఎవరేమీ చెబుతున్నారో తెలీని పరిస్థితిలో కొద్దిసేపు సాగి అనంతరం శుక్రవారానికి వాయిదా పడింది. పెద్ద నోట్ల రద్దు కారణంగా సంభవించిన మరణాలను ఉరీ ఉగ్రవాద దాడిలో జరిగిన మరణాలతో కాంగ్రెస్ నేత ఆజాద్ పోల్చడం పరిస్థితిని మరింత వేడెక్కించింది. కాగా, రాజ్యసభ సాగే పరిస్థితే లేకుండా పోయింది.

చిత్రం.. పెద్ద నోట్ల రద్దుపై గురువారం లోక్‌సభలో చెలరేగిన గందరగోళ దృశ్యమిది