జాతీయ వార్తలు

తిరుగుబాటు తప్పదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 17: దేశవ్యాప్తంగా పెద్దనోట్ల రద్దుపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గురువారం కేంద్రానికి అల్టిమేటం జారీ చేశారు. రద్దు నిర్ణయాన్ని మూడు రోజుల్లో వాపస్ తీసుకోకపోతే దేశవ్యాప్తంగా ప్రభుత్వంపై తిరుగుబాటు వస్తుందని హెచ్చరించారు. వారిద్దరూ గురువారం రిజర్వ్ బ్యాంక్‌ను సందర్శించి కొత్త నోట్ల ప్రింటింగ్ పరిస్థితిని సమీక్షించి వచ్చారు. ‘మూడు రోజుల్లో నిర్ణయం వెనక్కి తీసుకోవాలి. ప్రజల సహనాన్ని పరీక్షించవద్దు. మీరు నిర్ణయం ఉపసంహరించకుంటే దేశమంతటా తిరుగుబాటు వస్తుంది.’ అని ఆజాద్‌పూర్ మండీలో పర్యటించిన సందర్భంగా అన్నారు. 1947లో భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత అతి పెద్ద కుంభకోణంగా నోట్ల రద్దు అంశాన్ని కేజ్రీవాల్ అభివర్ణించారు. ‘ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజ్యాంగ నియమాలను ఉల్లంఘించారు. నోట్ల రద్దు నిర్ణయం తీసుకునే ముందు దాన్ని అమలు చేసేందుకు సరైన ప్రణాళిక మీరు(మోదీ) ఎందుకు చేసుకోలేదు. మీ నిర్ణయం వల్ల సామాన్యుడు ఇబ్బంది పడుతున్నాడు. మీకు మూడు రోజులు గడువిస్తున్నాం. సమస్యలన్నింటినీ తక్షణం పరిష్కరించండి. అలా చేయకపోతే మిమ్మల్ని వదిలేది లేదు. మేమింకా బతికే ఉన్నాం’ అని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా వ్యాఖ్యానించారు. మోదీ అత్యంత నియంతృత్వంగా వ్యవహరిస్తున్నారని ఆమె అన్నారు. ప్రజల నుంచి దాదాపు 10లక్షల కోట్ల రూపాయలను బలవంతంగా డిపాజిట్ చేయిస్తున్నారని ఇద్దరు నేతలు ఆరోపించారు. 500 కోట్ల రూపాయల ఖర్చుతో బిజెపి నేత గాలి జనార్దనరెడ్డి కూతురు వివాహం చేస్తుంటే ఆదాయపు పన్నుశాఖ ఎందుకు దాడులు చేయలేదని, తమను మాత్రం పెళ్లికోసం కేవలం రూ.2.5 లక్షలు ఖర్చు చేసుకోవాలంటూ ఆదేశిస్తున్నారని పేర్కొన్నారు. ‘మోదీజీ దేశభక్తి పేరుతో ప్రజలను మోసం చేయకండి. నగదు మార్పిడి కోసం, నగదు ఉపసంహరణ కోసం వరుసల్లో నిలబడి 40మంది ప్రాణాలు కోల్పవటానికి ఎవరు బాధ్యులు?’ అని కేజ్రీవాల్ తీవ్రంగా ప్రశ్నించారు. ఇద్దరు నేతలు కలిసి గురువారం ఉదయం ఢిల్లీలోని రిజర్వ్ బ్యాంక్‌కు వెళ్లారు. ‘దేశంలో సామాన్య పరిస్థితులు నెలకొనటానికి ఎంత కరెన్సీ కావాలి? ఎంత వరకు ప్రింట్ అయింది? దాని విలువ ఎంత? ఇంకా ఎన్ని రోజులు పడుతుంది? అని విచారించి వచ్చినట్లు కేజ్రీవాల్ ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. వాళ్లు తమకు గత ఏడాదికి సంబంధించిన నివేదిక ఇచ్చారని తెలిపారు. ఆర్బీఐ స్పందన అసంతృప్తిగా ఉందని ఆయన తెలిపారు. బుధవారం మమతా బెనర్జీ నేతృత్వంలో జరిగిన ర్యాలీలో శివసేన కూడా పాల్గొన్నందునే కేజ్రీవాల్ ఆ ర్యాలీలో పాల్గొనలేదని ఆప్ వర్గాలు వెల్లడించాయి.

చిత్రం.. నోట్ల రద్దు నిర్ణయాన్ని వాపస్ తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గురువారం ఢిల్లీలో నిర్వహించిన ధర్నాలో చేతులు కలిపిన పశ్చిమ బెంగాల్, ఢిల్లీ ముఖ్యమంత్రులు మమత, కేజ్రీవాల్