జాతీయ వార్తలు

బంకులే ఎటిఎమ్‌లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 17: పెద్ద నోట్లు రద్దయి పది రోజులు గడిచినా సామాన్యుల కష్టాలకు అంతూ పొంతూ లేకపోవడంతో కేంద్రం మరో వెసులుబాటు కల్పించింది. కొత్త నోట్లకు తగ్గట్టుగా ఏటిఎమ్‌లు సాంకేతికంగా సిద్ధం కాకపోవడంతో ఇక పెట్రోలు బంకుల్నే ఎటిఎమ్ కేంద్రాలుగా మార్చాలని నిర్ణయించింది. ఆ విధంగా ఎటిఎమ్‌లు, బ్యాంకులపై వత్తిడి తగ్గించే యోచన చేసింది. అన్ని అధీకృత పెట్రోలు బంకుల్లో 2వేల వరకూ డెబిట్ కార్డుపై నగదు కల్పించాలని సంకల్పించింది. ఇందులో భాగంగా ప్రభుత్వ రంగ చమురు కంపెనీలైన ఐఓసి, భారత్ పెట్రోలియం,హిందుస్థాన్ పెట్రోలియం సంస్థలు ఎస్‌బిఐ చేతులు కలిపాయి. కొత్త నోట్లు వచ్చే వరకూ సామాన్య ప్రజల ఇబ్బందుల్ని కొంత మేరకైనా తీర్చే ఉద్దేశంతో చమురు కంపెనీల సీనియర్ అధికారులు ఎస్‌బిఐ చైర్మన్ అరుంధతి భట్టాచార్యను కలిసి పౌరులకు నగదునందించేందుకు సిద్ధమని తెలిపారు. ఎస్‌బిఐకి చెందిన పిఓఎస్ యంత్రాలు అందుబాటులో ఉన్న బంకుల్లో వినియోగదారులకు డెబిట్ కార్డుపై 2వేల చొప్పున ఇస్తామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాలు సహా ఈ నగదు సౌకర్యం దేశ వ్యాప్తంగా 2500 పెట్రోలు బంకుల్లో అందుబాటులోకి వస్తుంది. క్రమానుగతంగా 20వేల పెట్రోలు బంకులకూ దీన్ని విస్తరించేందుకు ఇతర బ్యాంకులతో కూడా చమురు కంపెనీలు చర్చలు జరుపుతున్నాయి.