జాతీయ వార్తలు

నాలుగు రాష్ట్రాల వివాదంగానే చూడాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ,ఏప్రిల్ 7: కృష్ణా జలాల వివాదం పరిష్కరించే బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్ తదుపరి విచారణ వచ్చే నెల 9,10,11 తేదీలకు వాయిదా పడింది. గురువారం నాడు బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ ముందు కృష్టా నదీ పరివాహక రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్నాటక సుదీర్ఘ వాదనలు వినిపించాయి. మహారాష్ట్ర తరఫున సీనియర్ న్యాయవాది అంద్యార్జున ట్రిబ్యునల్ ముందు వాదనలు వినిపిస్తూ ఇది కేవలం ఏపీ, తెలంగాణల మధ్య వివాదమని, రాష్ట్ర విడిపోయిన తర్వాత అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ ఆస్తులు, అప్పులు రెండు రాష్ట్రాలు పంచుకున్నట్లే ఉమ్మడి ఏపీకి కేటాయించిన నీటినే ఆంధ్ర, తెలంగాణలు పంచుకోవాలన్నారు. మళ్లీ మొదటి నుండి నీటి పంపకాలు జరపాలనడంలో అర్థం లేదన్నారు. తెలంగాణ అప్పాయింట్‌మెంట్ తేదీకంటే ముందు ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పులో ఎట్టి పరిస్థితుల్లో జోక్యం చేసుకోవద్దని విభజన చట్టంలో ఉందని మహారాష్ట్ర వాదించింది. ట్రిబ్యునల్ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును తెలంగాణ ఆశ్రయించిందని, గతంలో ఇచ్చిన ట్రిబ్యునల్ తీర్పును రద్దు చేయాలంటూ తెలంగాణ వాదించడం సరికాదని మహారాష్ట్ర వాదించింది. ఆంధ్రప్రదేశ్ తరఫున సీనియర్ న్యాయవాది ఏకే గంగూలీ వాదనలు వినిపిస్తూ రాజ్యాంగంలోని ఆర్టికల్ 262 ప్రకారం 1956 అంతర్రాష్ట్ర నదీ జలాల చట్టం ఏర్పాటు అయిందని, దానిలో భాగంగానే ట్రిబ్యునళ్లు ఏర్పడ్డాయని తెలిపారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు,నాలుగు అధారంగానే ఆంధ్రప్రదేశ్ విభజనతో తెలంగాణ ఏర్పాటు జరిగిందన్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని సెక్షన్ 89(ఎ) లో అంతర్రాష్ట్ర నదీ జలవివాదాల చట్టం 1956 కింద ఏర్పాటైన ట్రిబ్యునల్ ప్రాజెక్టువారీగా నీటి జలాలను కేటాయించక పోతే,ప్రాజెక్టువారీ కేటాయింపులు జరపడం, సెక్షన్ 89 (బి)కింద తక్కువ నీటిప్రవాహం సందర్భాలలో ప్రాజెక్టుల వారీగా నీటిని విడుదల చేయడానికి ఆపరేషనల్ ప్రోటోకాల్ నిర్మించడం లాంటివి చట్టంలో స్పష్టంగా ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ వాదించింది. ఆ కోణంలో ఈ వివాదాన్ని రెండు రాష్ట్రాల మధ్య సమస్యగా కాకుండా నాలుగు రాష్ట్రాల వివాదంగానే పరిగణనలోకి తీసుకోవాలని గంగూలీ స్పష్టం చేశారు. పంజాబ్, హర్యానా రాష్ట్రాల విషయంలో రావి, బియాస్ నదుల మధ్య వివాదం తలెత్తినపుడు ట్రిబ్యునల్ లేదని, అప్పుడు పార్లమెంట్ చట్టం చేసి నీటి పంపకాలు చేపట్టిందనే విషయాన్ని ట్రిబ్యునల్ దృష్టికి తీసుకొచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగే సమయానికి బ్రజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ ఉనికిలో ఉందని, అందుకే ఈ సమస్యకు ట్రిబ్యునల్ పరిష్కారం చూపాలని విభజన చట్టంలో పేర్కొన్నారని ఏపీ తెలిపింది. ట్రిబ్యునల్ పొడిగింపు గురించి చట్టంలో పేర్కొలేదని, ట్రిబ్యునల్ గడువును రెండేళ్లు పొడిగించిన విషయాన్ని జలవనరుల శాఖ సర్క్యులర్ జారీ చేసిందని తెలిపారు. పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఆంశాలు గందరగోళంగా ఉన్నందునే రాష్ట్రాలమధ్య వివాదం తలెత్తిందని ట్రిబ్యునల్‌కు ఏపీ తెలిపింది.
అంతకుముందు కర్నాటక తరఫున్యాయవాది అనిల్ దివాన్ వాదనలు వినిపిస్తూ ఇది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలమధ్య వివాదం మాత్రమేనన్నారు. ముందు పునర్వ్యవస్థీకరణ చట్టం అర్థం చేసుకుంటే ఈ వివాదం ఆంధ్ర,తెలంగాణల మధ్యనే అనే విషయం స్పష్టం అవుతుందని ట్రిబ్యునల్‌కి తెలిపారు. మూడు రాష్ట్రాల వాదనలు విన్న ట్రిబ్యునల్ తదుపరి విచారణను వచ్చేనెల 9,10,11 తేదీలకు వాయిదా వేసింది. తర్వాత తెలంగాణ రాష్ట్రం వాదనలు వినిపించనుంది.