జాతీయ వార్తలు

నేను రైల్‌వాలాను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 18: తన జీవితం అంతా రైల్వే ప్లాట్‌ఫామ్‌లపైనే గడిచిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. శుక్రవారం భారత రైల్వేలు నిర్వహించిన ‘రైల్ వికాస్ శిబిర్’ ప్రారంభం సందర్భంగా మాట్లాడిన మోదీ రైల్వేలను అవసరాను గుణంగా తీర్చిదిద్దాలన్నదే తన ఆశయమని చెప్పారు.
వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఈ సమావేశాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. దేశాభివృద్ధికి రైల్వేల అభివృద్ధి ఎంతో అవసరమని, ప్రగతి వేగాన్ని సంతరించుకోవాలంటే అది రైల్వేల ద్వారానే సాధ్యమవుతుందని వెల్లడించారు.
మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా రైల్వేల్లో కూడా సరికొత్త టెక్నాలజీని అందుబాటులోకి తేవడం ఎంతైనా అవసరమని, అయితే అనుకున్న విధంగా రైల్వేలను తీర్చిదిద్దాలంటే మరింతగా కృషి చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ రైల్వేలు ఆధునీకరణంను సంతరించుకున్నాయని, భారత్‌లోమాత్రం అనుకున్న స్థాయిలో అవి అభివృద్ధి కాకపోవడానికి కారణమేమిటని ప్రశ్నించారు. శతాబ్దం మారింది కాబట్టి రైల్వేల్లోనూ ఆధునికత తొణికిసలాడాలని, ఈ లక్ష్యాన్ని సమష్టి కృషితో సాధించగలుగుతామని అన్నారు. నిన్నమొన్నటి వరకూ తనను చాయ్‌వాలాగా అభివర్ణించుకున్న మోదీ ఈ సందర్భంగా తనను రైల్‌వాలాగా చెప్పుకున్నారు.

చిత్రం.. భారత రైల్వేలు శుక్రవారం నిర్వహించిన ‘రైల్ వికాస్ శిబిర్’లో ప్రధాని నరేంద్ర మోదీ