జాతీయ వార్తలు

జయ పూర్తిగా కోలుకున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, నవంబర్ 18: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్య పరిస్థితి బాగా మెరుగైందని, వెంటిలేటర్ తొలగించినా సొంతంగా శ్వాస తీసుకుంటున్నారని అపోలో ఆసుపత్రి ప్రకటించింది. ఆసుపత్రి చైర్మన్ ప్రతాప్ సి రెడ్డి శుక్రవారం నాడొక ప్రకటన చేస్తూ జయ ఎప్పుడు కోరుకుంటే అప్పుడు డిశ్చార్జి అవ్వొచ్చని స్పష్టం చేశారు. ఇన్‌ఫెక్షన్ సోకకూడదనే ఆమెను ఐసియులోనే ఉంచినట్టు ఆయన తెలిపారు.‘జయ బాగానే నిద్రపోతున్నారు. ఆహారం కూడా మామూలుగానే తీసుకుంటున్నారు. సిఎంకు సరిపడేలా పౌష్ఠికాహారమే ఇస్తున్నాం’అని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి మానసిక స్థితి భేషుగ్గా ఉందని తాను భరోసా ఇస్తున్నట్టు మీడియా అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. అన్నాడిఎంకె అధినేత్రి పూర్తిగా కోలుకున్నారని, ఇన్‌ఫెక్షన్లు రాకూడదనే ఐసియులో ఉంచినట్టు అపోలో చైర్మన్ పునరుద్ఘాటించారు. జయలలిత ఎప్పుడైనా డిశ్చార్జి కావచ్చని ఆయన స్పష్టం చేశారు. కాగా అమ్మ త్వరలోనే ఇంటికి వస్తారని అన్నాడిఎంకె అధికార ప్రతినిధి సంపత్ వెల్లడించారు.జయ ఆరోగ్యం పూర్తిగా మెరుగైందని వైద్యులు తెలిపినట్టు ఆయన పేర్కొన్నారు.