జాతీయ వార్తలు

నేడు నగదు మార్పిడి బంద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 18: దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకుల్లోనూ శనివారం నగదు మార్పిడి ఉండదని భారత బ్యాంకింగ్ అసోసియేషన్ స్పష్టం చేసింది. అయితే సీనియర్ సిటిజన్లకు ఈ విషయంలో మినహాయింపును ఇస్తున్నామని వారికి మాత్రమే సేవలు అందిస్తామని వెల్లడించింది. ఇందుకోసం బ్యాంకులు అన్ని ఏర్పాట్లూ చేశాయని ఈ సారి ఆదివారం సెలవు ఉంటుందని సంఘం అధ్యక్షుడు రాజీవ్ రుషి తెలిపారు. పెద్దనోట్ల రద్దు జరిగినప్పటి నుంచి దేశ వ్యాప్తంగా అన్ని బ్యాంకుల సిబ్బంది ఎంతో శ్రమిస్తున్నారని ఇప్పటి వరకూ చేపట్టిన చర్యల కారణంగా శనివారం కొంతమేర రద్దీ తగ్గుతుందని భావిస్తున్నట్టు తెలిపారు. శనివారం నగదు మార్పిడి ఉండదని కేవలం సీనియర్ సిటిజన్‌లకు మాత్రమే అవకాశం కల్పిస్తున్నామని స్పష్టం చేశారు.