జాతీయ వార్తలు

నగదు మార్పిడి కొనసాగుతుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 18: దేశ వ్యాప్తంగా పెద్దనోట్లు రద్దు అనంతరం చేపట్టిన నగదు మార్చిడి ప్రక్రియను కొనసాగిస్తామని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం స్పష్టం చేసింది. పాత నోట్లకు బదులు కొత్త నోట్లు ఇచ్చే పద్ధతికి కూడా ప్రభుత్వం స్వస్తిపలకబోతోందంటూ వస్తున్న కథనాలను ఖండించింది. నగదు మార్పిడి అనేక రకాలుగా అక్రమాలకు దారితీస్తోందంటూ ఆరోపణలు రావడంతో దీన్ని కూడా నిలిపివేయాలని కేంద్ర భావిస్తున్నట్టు తొలుత వార్తలొచ్చాయి. అయితే ఇలాంటి ఆలోచన ప్రభుత్వానికి ఎంతమాత్రం లేదని నగదు మార్పిడి కొనసాగుతుందని ప్రభుత్వ వర్గాలు వివరించాయి. వరుసగా నగదు మార్పిడి పరిమాణాన్ని తగ్గిస్తూ రావడంతో ఇదికూడా కొనసాగదేమోనన్న అనుమానలు ప్రజల్లో నెలకొన్నాయి. అయితే పదేపదే ఒక్కరే బ్యాంకులకు రావడాన్ని నిరోధించడానికి అనేక చర్యలు చేపట్టామని అధికారులు వెల్లడించారు.