జాతీయ వార్తలు

అమరావతి రోడ్లకు 1,275 కోట్ల హడ్కో రుణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 18: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి సీడ్ యాక్సిస్ రోడ్లు, ప్రాధాన్యతా రోడ్ల నిర్మాణానికి 1,275 కోట్ల రూపాయలు కేటాయించాలని హడ్కో బోర్డు శుక్రవారం జరిగిన సమావేశంలో నిర్ణయించింది. అమరావతిలో రానున్న మూడు సంవత్సరాల్లో చేపట్టే వివిధ ప్రాజెక్టులకోసం హడ్కో 7,500 కోట్ల రుణ సహాయం అందించేందుకు ఏపి రాజధాని అభివృద్ధి సంస్థతో ఒక ఒప్పందం చేసుకోవటం తెలిసిందే. అమరావతిలో ఎనిమిది మాస్టర్ ప్లాన్ రోడ్లు (సుమారు 88 కిలోమీటర్ల పొడవు) సీడ్ యాక్సిస్ రోడ్డు- గుంటూరు జిల్లాలోని దొండపాడు గ్రామాన్ని జాతీయ రహదారి 5తో కలుపుతూ నిర్మించటం, ఏడు అమరావతి నగర రోడ్ల నిర్మాణానికి 1,471 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ఈ రోడ్ల నిర్మాణానికి హడ్కో బోర్డు శుక్రవారం జరిగిన సమావేశంలో 1,275 కోట్ల రుణాన్ని విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ రుణాన్ని 15 సంవత్సరాల్లో తిరిగి చెల్లించవలసి ఉంటుంది. రోడ్ల నిర్మాణం మూడు సంవత్సరాల్లో పూర్తి చేయవలసి ఉంటుంది.