అంతర్జాతీయం

బ్రహ్మచారులకేం తెలుసు పెళ్లిళ్ల కష్టాలు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 18: పెద్ద నోట్లను రద్దు చేయాలన్న నిర్ణయం తర్వాత సామాన్యులకు ఎదురవుతున్న ఇబ్బందులను తగ్గించడానికి కేంద్రం అనేక చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఈ పెళ్లిళ్ల సీజన్‌లో తమ పిల్లల పెళ్లిళ్లు పెట్టుకున్న కొన్ని కుటుంబాలు మాత్రం ఇప్పటికీ ఇబ్బందులు పడుతూనే ఉన్నాయి. వీరి కష్టాలను దృష్టిలో పెట్టుకునే నరేంద్ర మోదీ ప్రభుత్వం పెళ్లిళ్ల కోసం తగిన ఆధారాలు చూపించి రెండున్నర లక్షల రూపాయల దాకా తమ ఖాతాలనుంచి తీసుకోవడానికి అనుమతించాలని ఇటీవల నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే దేశంలోని నల్లధనాన్ని అదుపు చేయడానికి కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని గట్టిగా సమర్థిస్తున్న యోగాగురువు బాబా రామ్‌దేవ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా దేశంలో తలెత్తిన పరిస్థితిపై తనదైన శైలిలో సెటైర్లు వేశారు. పెద్దనోట్ల రద్దు నిర్ణయం అమలును గనుక కొన్ని రోజులు ఆలస్యం చేసి ఉంటే చాలా కుటుంబాలపై దాని ప్రభావం ఉండేది కాదని ఒక ప్రైవేట్ న్యూస్ చానల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో రామ్‌దేవ్ అంగీకరించారు. ‘బిజెపిలో చాలామంది బ్రహ్మచారులున్నారు. వారికి ఇది పెళ్లిళ్ల సీజన్ అనే విషయం తెలియదు. ఈ నిర్ణయం అమలులో జరిగిన పొరబాటు అదే’ అని రాందేవ్ ఈ సందర్భంగా అన్నారు. ప్రభుత్వం గనుక పదిహేను రోజులు లేదా నెల రోజుల తర్వాత ఈ పని (నోట్ల రద్దు) చేసి ఉంటే పెళ్లిళ్లపై దాని ప్రభావం ఉండేది కాదని కూడా ఆయన అన్నారు. రామ్‌దేవ్ ఇచ్చిన సమాధానం విని ఇంటర్వ్యూకు హాజరయిన జనం అంతా గొల్లున నవ్వేశారు. అయితే ఆ వెంటనే రామ్‌దేవ్ సరిదిద్దుకుని నల్లధనాన్ని అదుపు చేయడానికి తీసుకున్న సాహసోపేత నిర్ణయం ఇదని అన్నారు. పెద్ద నోట్ల రద్దు వల్ల కలిగిన ప్రయోజనాలను ఏకరవు పెడుతూ, వరకట్న ఆచారాన్ని అది ఆపిందన్నారు. ఇప్పుడు జనం వరకట్నం డిమాండ్ చేయడం లేదని, నోట్ల రద్దు వల్ల జరిగిన మంచి పని ఇదని రామ్‌దేవ్ అన్నారు.