జాతీయ వార్తలు

జాతీయ సేవా పథకం అవార్డులు ప్రదానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 19: సాంఘిక సంక్షేమ రంగంలో విశిష్ట సేవలు అందించిన వ్యుక్తులు, సంస్థలకు రాష్టప్రతి ప్రణబ్ శనివారం ఇందిరాగాంధీ జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్) అవార్డులను ప్రదానం చేశారు. మొక్కల పెంపకం, రక్తదానం, సామాజిక చైతన్య శిబిరాల నిర్వహణ లాంటి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న వ్యక్తులు, సంస్థలకు ఏటా ఈ అవార్డులను ప్రదానం చేయడం జరుగుతుంది. ఈ ఏడాది ఈ అవార్డులను అందుకున్న వారిలో యూనివర్శిటీ కేటగిరిలో వీర్ నర్మద్ దక్షిణ గుజరాత్ యూనివర్శిటీ తరఫున డాక్టర్ అచ్యుతానంద్ మాలవీయ, కువెంపు యూనివర్శిటీ తరఫున కుందన్ బసవరాజ్, బాబా సాహెబ్ అంబేద్కర్ యూనివర్శిటీ తరఫున ఆర్‌ఎన్ కప్రే ఉన్నారు. ఉత్తమ యూనివర్శిటీ కింద కేరళలోని డైరెక్టరేట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్ అబ్దుల్ జన్నర్ అహ్మద్, వర్ధమాన యూనివర్శిటీ అవార్డును మహాత్మాగాంధీ యూనివర్శిటీలోని ఎన్‌ఎస్‌ఎస్ విభాగం సభ్యుడు రబి ఆకుల అందుకున్నారు. మొత్తం 32 మంది వలంటీర్లు, 10 మంది అధికారులు ఈ అవార్డులను అందుకున్నారు.