జాతీయ వార్తలు

రైళ్లలో మరిన్ని మొబైల్ చార్జింగ్ పాయింట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 19: రైళ్లలో సెకండ్‌క్లాస్ స్లీపర్, జనరల్ కోచ్‌లలో మొబైల్ చార్జింగ్ పాయింట్లను పెంచుతున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ఇంతకు ముందు కోచ్‌కు ఎనిమిది మాత్రమే మొబైల్ చార్జింగ్ పాయింట్లు ఉండేవి. ఇప్పుడు వాటి సంఖ్యను 18కి పెంచుతున్నట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు. 7977 స్లీపర్, 4634 జనరల్ కోచ్‌లలో చార్జింగ్ పాయింట్లను పెంచారు. అన్ని ఏసి కోచ్‌లలో ఇప్పటికే అవసరమైన సంఖ్యలో చార్జింగ్ పాయింట్లు ఉన్నాయి. దేశంలో ప్రధాన రైల్వే స్టేషన్లలో వైఫై సౌకర్యం ఏర్పాటు చేశారు. భువనేశ్వర్, న్యూఢిల్లీ, ముంబై, హౌరా, బెంగళూరు, చెన్నై వంటి రైల్వే స్టేషన్లలో ఇప్పటికే వైఫై సౌకర్యం ఉంది.