జాతీయ వార్తలు

ఇసుక అక్రమ తవ్వకాలపై ఉక్కుపాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 21: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాలలో ఇసుక అక్రమ తవ్వకాలపై జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటి)లో దాఖలైన పిటిషన్ విచారణ ఏప్రిల్‌కు వాయిదాపడింది. ఆంధ్రప్రదేశ్‌లో ఐదు సంవత్సరాల్లో 32 వేలకు పైగా ఇసుక అక్రమ రవాణా కేసులు నమోదు చేశామని, రూ 39 కోట్ల జరిమానా విధించామని ఎన్జీటికి ప్రభుత్వం నివేదించింది. ఇసుక అక్రమ తవ్వకాలకు సంబంధించి ఐదు సంవత్సరాలలో 214 కేసులు నమోదయ్యాయని, నాలుగు కోట్ల రూపాయలు జరిమానా విధించినట్లు ట్రిబ్యునల్‌కి ఏపి వివరించింది. మహారాష్టల్రో 20 వేలకు పైగా ఇసుక అక్రమ రవాణా కేసులు నమోదు చేసినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎన్జీటికి నివేదించింది. కాగా తెలంగాణ ప్రభుత్వం తాము ఇసుక అక్రమ రవాణ తవ్వకాలపై కఠినంగా వ్యవహరిస్తున్నామని తెలిపింది. కంతనపల్లిలో ప్రాజెక్టు లేకున్నా పూడిక సేకరిస్తున్నారని చెప్పడాన్ని పిటిషనర్ తరపు న్యాయవాదులు విజయభాస్కర్, కె శ్రవణ్‌కుమార్ తప్పుపట్టారు. ఇసుక అక్రమ తవ్వకాలపై ‘రేలా’ అనే స్వచ్చంద సంస్థ ఎన్జీటిలో పిటిషన్ దాఖలు చేసింది.