జాతీయ వార్తలు

నల్లధనం క్యాన్సర్.. చికిత్స చేయాల్సిందే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చండీగఢ్, నవంబర్ 20: పెద్ద నోట్ల రద్దును వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలపై భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నోట్ల రద్దు అనే వరదలోనుంచి బయటపడటానికి అవి ఎలుకలు, పిల్లులు, పాముల వలె చెట్లు ఎక్కుతున్నాయని విమర్శించారు. ఆదివారం ఇక్కడ బిజెపి బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో అమిత్ షా మాట్లాడుతూ దేశాన్ని మార్చడానికి ప్రధాని నరేంద్ర మోదీకి 15 సంవత్సరాల సమయం ఇవ్వాలని, పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు అధికారాన్ని అప్పగించాలని ప్రజలను కోరారు. నోట్ల రద్దును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని ప్రధాన లక్ష్యంగా చేసుకొని ఆయన విమర్శల వర్షం కురిపించారు. యుపిఎ హయాం కుంభకోణాలకు పర్యాయపదంగా నిలిచిందని అమిత్ షా నిప్పులు చెరిగారు. కుప్పలుగా పోగుపడిన నల్లధనం క్యాన్సర్ వ్యాధిలాగా మారిందని, దీనికి శస్తచ్రికిత్స అవసరమని ఆయన నోట్ల రద్దు గురించి మాట్లాడుతూ అన్నారు. ‘శస్తచ్రికిత్స తరువాత ఎవరైనా కొంత నొప్పిని భరించాల్సి ఉంటుంది. అప్పుడే మిగతా జీవితకాలం అంతా ఆరోగ్యంగా ఉంటారు’ అని అన్నారు. నోట్ల రద్దుపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్న పార్టీలు తాము అధికారంలో ఉన్న సమయంలో నల్లధనం నిర్మూలనకు తీసుకున్న చర్యలేమిటని అమిత్ షా నిలదీశారు. ప్రతిపక్షాల మధ్య సైద్ధాంతిక విభేదాలు ఉన్నప్పటికీ నరేంద్ర మోదీ పాలనకు వ్యతిరేకంగా అవి ఐక్యమయ్యాయని ఆయన విమర్శించారు.
‘వరదలు వచ్చినప్పుడు మధ్యలో ఉన్న పెద్ద చెట్టును ఎక్కడానికి అన్నీ ప్రయత్నిస్తాయి. ఎలుకలు, పిల్లులు, పాములు, ముంగీసలు.. అన్నీ చెట్టెక్కుతాయి. అవి చెట్టెక్కినప్పుడు పిల్లి ఎలుకను తినదు. ముంగీస పాముపై దాడి చేయదు. అన్నీ వరద తగ్గేవరకు చెట్టు పైనుంచి వేచిచూస్తుంటాయి’ అని అమిత్ షా ప్రతిపక్షాలపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

చిత్రం.. చండీగఢ్‌లో ఆదివారం బిజెపి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న అమిత్ షా