జాతీయ వార్తలు

అభివృద్ధి పట్టని మమత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీర్పర (పశ్చిమబెంగాల్), ఏప్రిల్7: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రం అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమావేశాలను మమతా బెనర్జీ బహిష్కరించారని ఆయన విమర్శించారు. గత ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో ‘పరిబర్తన్’ (మార్పు) తీసుకొస్తానని హామీ ఇచ్చిన మమతా బెనర్జీ, ఆచరణలో ఎలాంటి మార్పు తీసుకురావడంలో విఫలమయ్యారని ఆయన విమర్శించారు. గురువారం ఇక్కడ జరిగిన ఒక ఎన్నికల సభలో మోదీ మాట్లాడుతూ ‘ఈమె ఏ రకమైన ముఖ్యమంత్రి? రాష్ట్రం అభివృద్ధిపై చర్చించడానికి కేంద్రం ఎప్పుడు సమావేశం నిర్వహించినా, దీదీ బహిష్కరించారు. హాజరు కాకుంటే తన రాష్ట్రానికి నష్టమని తెలిసినప్పటికీ, కేవలం మోదీ నిర్వహిస్తున్నారనే కారణంతో ఆమె ఆ సమావేశాలకు హాజరు కాలేదు. అదే సమయంలో మమతా బెనర్జీ ఢిల్లీకి వచ్చినప్పుడల్లా సోనియాగాంధీని కలిసి ఆమెనుంచి ఆశీస్సులు తీసుకున్నారు’ అని అన్నారు.
గత ఎన్నికల్లో రాష్ట్రంలో మార్పు తీసుకొస్తానంటూ మమతా బెనర్జీ ప్రజలను మోసగించారని ఆయన దుయ్యబట్టారు.
ఆమె మా, మాటి, మనుష్ గురించి మాట్లాడారని, కాని రాష్ట్రంలో వౌట్ (మరణాలు) మనీ (డబ్బు) మాత్రమే ఉన్నాయని మోదీ ఎద్దేవా చేశారు. నారద స్టింగ్ ఆపరేషన్ ఈ విషయాన్ని ధ్రువపరచిందని పేర్కొన్నారు.
ఇటీవల కోల్‌కతాలో ఫ్లైఓవర్ వం తెన కూలిన సందర్భంగా మమతా బెనర్జీ అనుసరించిన వైఖరిపై కూడా మోదీ ధ్వజమెత్తారు. వంతెన కూలిపోయిన వెంటనే సహాయక చర్యలు చేపట్టి, బాధితుల ప్రాణాలను కాపాడటానికి బదులు ముఖ్యమంత్రి ఇతరులను దూషించడానికి పూనుకున్నారని ఆయన విమర్శించారు. ఈ ఫ్లైఓవర్ కూలిన వెంటనే దాని నిర్మాణ కాంట్రాక్టు లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వ హయాంలో ఇచ్చిందని పేర్కొన్నారని, అయితే ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయిన తరువాత ఆమె లెఫ్ట్ ఫ్రంట్‌ను అభినందించారా? అని మోదీ నిలదీశారు. మమతా బెనర్జీ పాలనా పగ్గాలు చేపట్టిన మొదట్లో బెంగాల్‌లో పరిస్థితులను చక్కదిద్దుతున్నట్లుగా కనిపించిందని, కాని తీరా ఆమె కూడా వామపక్షాల బాటలోనే సాగారని, ఫలితంగా రాష్ట్రం మరింతగా ధ్వంసం అయిందని అన్నారు. టిఎంసి, లెఫ్ట్ చేతుల్లో మీ భవిష్యత్తుకు భద్రత ఉండదని మోదీ ప్రజలను ఉద్దేశించి అన్నారు. బిజెపి అధికారంలో ఉన్నచోట అభివృద్ధి జరుగుతోందని, అందువల్ల బెంగాల్‌లో బిజెపికి అధికారం ఇవ్వాలని ఆయన ప్రజలను కోరారు.

చిత్రం బీర్పరలో గురువారం జరిగిన ఎన్నికల సభలో
మాట్లాడుతున్న ప్రధాని మోదీ