జాతీయ వార్తలు

అమ్మకు, సైన్యానికే అంకితం చేస్తున్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పనాజీ, నవంబర్ 20: ప్రముఖ గాయకుడు ఎస్.పి.బాలసుబ్రమణ్యానికి 2016 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక శతాబ్దపు అవార్డు లభించింది. 47వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం (ఐఎఫ్‌ఎఫ్‌ఐ) ప్రారంభం సందర్భంగా ఆదివారం ఈ సమున్నత పురస్కారాన్ని ఆయనకు ప్రదానం చేశారు. తనకు లభించిన ఈ అవార్డును తన తల్లికి, దేశ ప్రజల భద్రత కోసం ప్రాణాలర్పించిన సైనికులకు అంకితం చేస్తున్నానని ఈ సందర్భంగా ఎస్పీ ప్రకటించారు. అలాగే ఈ అవార్డు సరిహద్దుల్లో నిరంతరం పహారా కాస్తున్న సైనికులకూ చెందుతుందన్నారు. సైనికులు లేకుండా మనం లేమని పేర్కొన్న బాలు అందుకే వినమ్రంగా ఈ అవార్డును వారికి అంకితం చేస్తున్నానని, ఇందుకు ఎంతో గర్వపడుతున్నానని తెలిపారు. కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందుకున్న అనంతరం బాలు మాట్లాడారు. తెలుగు, తమిళం, హిందీ సహా అనేక భాషల్లో 40వేల పాటలు పాడినందుకు గుర్తింపుగా ఎస్పీకి ఈ అవార్డు ఇచ్చారు. 70 సంవత్సరాలు దాటినా ఇంకా తాను పనిచేస్తూనే ఉండటం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్న ఆయన తాను ఈ స్థితికి రావడానికి దోహదం చేసిన ప్రతి ఒక్కరికీ మనసారా కృతజ్ఞతలు తెలియచేస్తున్నానని చెప్పారు.

చిత్రం.. ప్రముఖ గాయకుడు ఎస్.పి.బాలసుబ్రమణ్యంకు
సెంటినరీ అవార్డు బహూకరిస్తున్న కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు