జాతీయ వార్తలు

ఒడిశా గ్రామీణ బ్యాంకునుంచి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢెంకనాల్, నవంబర్ 21: ఒడిశాలోని ఢెంకనాల్‌లో ఉన్న రాష్ట్ర గ్రామీణ బ్యాంక్ శాఖనుంచి 1.15 కోట్ల రూపాయల విలువైన రద్దయిన వెయ్యి, 500 రూపాయల నోట్లను దోచుకుపోయారని పోలీసులు సోమవారం తెలిపారు. శని, ఆదివారాలు సెలవుల అనంతరం సోమవారం బ్యాంక్‌ను తెరిచినప్పుడు ఈ దోపిడీ వెలుగులోకి వచ్చిందని టౌన్ పోలీసు స్టేషన్ ఇన్‌చార్జి అభినవ్ దౌలా చెప్పారు. బ్యాంకులో 8 కోట్ల విలువైన పాత కరెన్సీ ఉందని, ఓ ట్రంకుపెట్టెలో ఉన్న 1.15 కోట్ల కరెన్సీ మాయమైందని ఆయన చెప్పారు. పోయిన సొమ్మంతా రద్దయిన వెయ్యి, 500 నోట్లేనని ఎస్పీ బసంత్ కుమార్ పాణిగ్రాహి చెప్పారు. బ్యాంకులోని సిసి టీవీ దృశ్యాలను పరిశీలిస్తున్నామని, ఈ నేరం వెనుక బ్యాంకులో పనిచేస్తున్న కొంతమంది పాత్ర ఉండి ఉండవచ్చని బలంగా నమ్ముతున్నామని కూడా ఆయన తెలిపారు. స్ట్రాంగ్ రూమ్‌లో ఉన్న 7 కోట్ల నగదు చెక్కు చెదరక పోవడం తమకు ఆశ్చర్యం వేస్తోందని ఆయన చెప్పారు. నగదు అంతా కూడా స్ట్రాంగ్ రూమ్‌లో మూడు పెద్ద పెట్టెల్లో పేర్చి ఉన్నట్లు ఆయన చెప్పారు. ఈ బ్యాంక్ ఢెంకనాల్ టౌన్ పోలీసు స్టేషన్‌కు కూతవేటు దూరంలోనే ఉండడం గమనార్హం.