జాతీయ వార్తలు

గ్రూపు-సి ఉద్యోగులకు 10 వేల అడ్వాన్స్ చెల్లింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 21: పెద్ద నోట్ల రద్దు కారణంగా బ్యాంకులు, ఎటిఎంల వద్ద ఓ వైపు భారీ క్యూలు ఉంటుండగా, మరో వైపు కేంద్ర ప్రభుత్వంలోని గ్రూపు-సి ఉద్యోగులు సోమవారంనుంచి తమ నవంబర్ నెల జీతంలో పది వేల రూపాయల నగదును అడ్వాన్స్‌గా తీసుకోవడం ప్రారంభించారు. హోం మంత్రిత్వ శాఖలో పని చేస్తున్న దాదాపు వెయ్యి మంది గ్రూప్-సి ఉద్యోగులకు కూడా పది వేల రూపాయల నగదును వేతన అడ్వాన్స్‌గా చెల్లించారు. అన్ని మంత్రిత్వ శాఖలు, డిపార్ట్‌మెంట్‌లు, అనుబంధ సంస్థల్లో పని చేస్తున్న గ్రూపు-సి ఉద్యోగులందరికీ నగదు రూపంలో శాలరీ అడ్వాన్స్‌ను చెల్లించడం జరుగుతోందని హోం శాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ఈ సదుపాయాన్ని ఉపయోగించుకున్న ఉద్యోగులందరికీ 2వేలు, వంద రూపాయల నోట్ల రూపంలో చెల్లింపులు జరిపారు.