జాతీయ వార్తలు

యూపీలో కొత్త కూటమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, నవంబర్ 21: సంకీర్ణానికి సమాజ్‌వాది నేత ములాయం నో చెప్పటంతో ఉత్తరప్రదేశ్‌లో జనతా పరివార్ కొత్త కూటమికి తెరలేపింది. రాష్ట్రీయ లోక్‌దళ్, యునైటెడ్ జనతాదళ్‌లతోపాటు మరో స్థానిక పార్టీ కూటమిగా ఏర్పడుతున్నట్లు ఆరెల్డీ అధినేత అజిత్‌సింగ్ సోమవారం ప్రకటించారు. తమ కూటమి రాష్ట్రంలోని మొత్తం 403 స్థానాలకు పోటీ చేస్తుందని ఆయన తెలిపారు. అయితే ఎవరు ఎన్ని సీట్లలో పోటీ చేస్తారనేది మాత్రం చర్చల అనంతరం నిర్ణయిస్తామన్నారు. ఈ సందర్భంగా ములాయంసింగ్‌పై అజిత్‌సింగ్ తీవ్రంగా మండిపడ్డారు. బిహార్ ఎన్నికల సందర్భంగా లోహియావాదులు, చరణ్‌సింగ్ వాదులు సమష్టిగా సమాజ్‌వాదితో పొత్తు పెట్టుకోవటానికి ప్రయత్నిస్తే అప్పుడు ములాయం తిరస్కరించారని, ఇప్పుడు యూపి ఎన్నికల నేపథ్యంలో పొత్తుల ప్రస్తావన చేసినప్పుడు తమ పార్టీలో విలీనం కావాలని డిమాండ్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా జత కట్టడానికి ములాయం ఎందుకు అంగీకరించటం లేదో అర్థం కావటం లేదన్నారు.