జాతీయ వార్తలు

సహకారాన్ని అడ్డుకోవడం సరికాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 21: దక్షిణాసియా ప్రాంతీయ సహకార మండలి (సార్క్)లో ప్రాంతీయ సహకారానికి తీసుకునే ప్రతి చర్యను అడ్డుకుంటున్న పాక్ వైఖరిని భారత్ తీవ్రంగా దుయ్యబడ్తూ, దీనివల్ల ఈ ప్రాంతంలోని దేశాలు ‘బిమ్‌స్టెక్’లాంటి ఇతర ప్రత్యామ్నాయాలను వెతుక్కునేలా చేస్తుందని హెచ్చరించింది. విదేశాంగ శాఖ కార్యదర్శి ఎస్ జైశంకర్ సోమవారం ఇక్కడ ‘ఇండియా అండ్ ది గ్రేట్ పవర్స్: కంటిన్యుటీ అండ్ చేంజ్’ అనే అంశంపై కీలక ఉపన్యాసం చేస్తూ పాకిస్తాన్ పేరును నేరుగా ప్రస్తావించకుండా సార్క్ విషయంలో ఆ దేశం అనుసరిస్తున్న వైఖరిని దుయ్యబట్టారు. ప్రాంతీయ సహకారానికి సంబంధించి కొన్ని కనీస ప్రమాణాలు వర్తింపజేయాలని, సార్క్‌లోని మెజారిటీ సభ్య దేశాలు సహకార చర్యలు కొనసాగాలని కోరుకుంటున్నాయని అన్నారు. పాక్-చైనా సంబంధాలను ప్రస్తావిస్తూ, పాక్ ఆక్రమిత కాశ్మీర్ గుండా చైనా నిర్మిస్తున్న ఆర్థిక కారిడార్‌సహా ఈ సంబంధాల కారణంగా తలెత్తే కొన్ని అంశాలు భారత్‌కు ఆందోళన కలిగిస్తున్నాయని జైశంకర్ అన్నారు. కాగా, భారత్, పాక్‌ల మధ్య ఉన్న సమస్యల పరిష్కారానికి ఏ మూడో దేశం జోక్యం అవసరం లేదని జైశంకర్ స్పష్టం చేస్తూ, దీనివల్ల అనవసర అపోహలు, అంచనాలు తలెత్తుతాయన్నారు.
ఈ మధ్యనే అమెరికానుంచి తిరిగివచ్చిన జైశంకర్ తన ప్రసంగంలో అమెరికా ఎన్నికలతోసహా పలు సమకాలీన అంశాలను ప్రస్తావిస్తూ, అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికయిన డొనాల్డ్ ట్రంప్ తన విదేశీ విధానం విషయంలో ఎలా వ్యవహరిస్తారో వేచి చూడాల్సిన అవసరం ఉందని అన్నారు. అయితే ఎలాంటి మార్పూ ఉండబోదని భావించకూడదన్నారు. సార్క్ గురించి మాట్లాడుతూ సార్క్ విషయంలోను, ఈ ప్రాంత దేశాల మధ్య కనెక్టివిటీని మెరుగుపరిచే విషయంలో భారత్‌కు ఎంతో ఆసక్తి ఉందని, ఈ ప్రాంత దేశాల మధ్య సహకారం వల్ల ఆసియాతోసహా ఈ మొత్తం ప్రాంతానికి మేలు చేకూరుతుందని అన్నారు.