జాతీయ వార్తలు

మొసళ్లను పట్టుకునేందుకు చేపలను చంపకండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ,నవంబరు 21: పెద్దనోట్ల రద్దు వల్ల సామాన్యులు ఏదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని రాష్ట్ర ఐటి, పురపాలకశాఖ మంత్రి కె టి రామారావు అన్నారు. సోమవారం నాడు కెటిఆర్ బిజీబిజీగా గడిపారు. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో, ఆస్ట్రేలియా రాయబారితో విడివిడిగా సమావేశమయ్యారు. అనంతరం సీఐఐ అధ్వర్యంలో బిల్డింగ్ ఇండియాన్ ఎనర్జీ స్టోరేజి మార్కెట్ అనే అంశంపై జరిగిన సదస్సులో ఆయన ప్రసంగించారు. అనంతరం 36వ ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్‌లో జరిగిన ‘‘తెలంగాణ స్టేట్ డే’’ కార్యక్రమంలో కెటిఆర్ పాల్గొన్నారు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ తెలంగాణలో పెట్టుబడులకు సహాకరించాలని ఆస్ట్రేలియా రాయబారిని కోరినట్లు తెలిపారు. ఆస్ట్రేలియాలో జరిగే ఆస్ట్రేలియా- ఇండియా లీడర్స్ సమ్మిట్‌లో పాల్గొనాలని తనను ఆహ్వానించినట్లు కెటిఆర్ వెల్లడించారు. త్వరలోనే ముఖ్యమంత్రి కెసిఆర్‌తో ఈ ఆహ్వానంపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించినట్లు తెలిపారు. పాతనోట్ల రద్దు వల్ల సామాన్యులకు ఇబ్బందులు లేకుండా చూడాల్సిన బాధ్యత కేంద్రానిదేనన్నారు.