జాతీయ వార్తలు

యుద్ధం ఆగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 22: ‘నల్లధనం, అవినీతిపై మనం మొదలుపెట్టిన యుద్ధం ఇప్పట్లో ఆగదు. పెద్ద నోట్ల రద్దు మహాయజ్ఞానికి ఆరంభం మాత్రమే. ముందు ముందు మరిన్ని కఠిన చర్యలున్నాయి. ఇదంతా దేశ ప్రయోజనాల కోసమేనన్న విషయాన్ని మరువకూడదు’ అని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్వేగంగా చెప్పారు. ‘దేశం కోసమే పెద్ద నోట్లను రద్దు చేశాం తప్ప, స్వప్రయోజనాల కోసం కాదు’ అని మంగళవారం జరిగిన బిజెపి పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఉద్వేగంగా మాట్లాడినట్టు తెలిసింది. నల్లధనంపై మోదీ మొదలుపెట్టిన చారిత్రక యుద్ధానికి బిజెపి పార్లమెంటరీ పార్టీ పూర్తి మద్దతు తెలుపుతూ ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది. హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రతిపాదించిన తీర్మానానికి సమాచార, పట్టణాభివృద్ధి మంత్రి ఎం వెంకయ్యనాయుడు మద్దతిచ్చారు. ‘ఈ మహా యజ్ఞాన్ని విజయవంతం చేసేందుకు అందరూ తనకు సహకరించాలి’ అని మోదీ మాట్లాడుతూ సమావేశంలోనే రెండు మూడుసార్లు ఉద్వేగానికి గురైనట్టు తెలిసింది. నల్లధనం, అవినీతితో నలిగిపోతున్న దేశ ప్రజలకు పెద్ద నోట్ల రద్దుతో మేలు జరుగుతుందని మోదీ అభిప్రాయపడ్డారు. ఆరోగ్యకరమైన ఆర్థిక వ్యవస్థ రూపొందించాలన్న లక్ష్యంతో ఎన్డీయే ప్రభుత్వం పని చేస్తుందని ఎంపీలకు సూచించారు.
చారిత్రాత్మక నిర్ణయం
500, వెయ్యి నోట్ల రద్దు ప్రధాని మోదీ ధైర్యంతో తీసుకున్న చారిత్రక నిర్ణయమని బిజెపి పార్లమెంటరీ పార్టీ తీర్మానించింది. బిజెపి ఎంపీలంతా సీట్ల వద్దే నిలబడి హర్షధ్వానాలతో మోదీ నిర్ణయానికి మద్దతు పలికారు. తీర్మానానికి మద్దతిచ్చిన మంత్రి వెంకయ్య మాట్లాడుతూ ప్రజల పక్షాన నిలవాలో, లేక నల్లధనం, అవినీతిపరుల ప్రయోజనాలు కాపాడాలో రాజకీయ పార్టీలు తేల్చుకోవాలని సవాల్ చేశారు. మోదీ నిర్ణయాన్ని బిజెపి పార్లమెంటరీ పార్టీ ఏకగ్రీవంగా సమర్ధిస్తోందని తీర్మానంలో పేర్కొన్నారు. మోదీ నిర్ణయంతో ఉగ్రవాదులకు ఆర్థిక మద్దతు అరికట్టడంతోపాటు, దొంగ నోట్లు, నల్లధనం, అవినీతి అంతమైపోతుందని తీర్మానంలో అభిప్రాయపడ్డారు. ప్రస్తుత యజ్ఞంతో దేశ ఆర్థిక వ్యవస్థ పరిశుభ్రమై, ప్రజల ఆర్థిక అలవాట్లలో మార్పు తెస్తుందని తీర్మానంలో సూచించారు. రాజకీయ వ్యవస్థలోనూ సమూలమైన మార్పులు వస్తాయన్నారు. పెద్ద నోట్ల రద్దుతో సామాన్యులకు ఎదురైన ఇబ్బందులను తొలగించేందుకు ఎన్డీయే తీసుకున్న చర్యలను బిజెపి పార్లమెంటరీ పార్టీ ప్రశంసించింది. ఆరోగ్యవంతమైన దేశం కోసమే ప్రజలు కొత్త నోట్ల కోసం బ్యాంకుల వద్ద వరుసల్లో నిలబడుతున్నారని తీర్మానంలో పేర్కొన్నారు. మోదీ చారిత్రక నిర్ణయాన్ని సమర్థించిన దేశ ప్రజలను బిజెపి పార్లమెంటరీ పార్టీ అభినందించింది. కొన్ని రాజకీయ పార్టీలు దేశంలో గందరగోళం సృష్టించేందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని తీర్మానంలో ఆరోపించారు. ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని విశ్వసించవద్దని బిజెపి సూచించింది. దేశ ప్రయోజనాల కోసం రాజకీయ పార్టీలు మోదీ నిర్ణయాన్ని సమర్థించాలని తీర్మానంలో విజ్ఞప్తి చేసింది.