జాతీయ వార్తలు

సర్కారీ స్కూళ్లు మూతపడాల్సిందేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబరు 22: ప్రభుత్వ పాఠశాలలు మూతపడకుండా కాపాడలేరా? వాటిని కాపాడాల్సిన బాధ్యత సర్కారుది కాదా? విద్యా హక్కు చట్టాన్ని ఎందుకు అమలు చెయ్యరు? అంటూ సుప్రీంకోర్టు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను నిలదీసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత, వౌలిక సదుపాయాల లేమిపై వేర్వేరుగా దాఖలైన పిటిషన్లను మంగళవారం సుప్రీం కోర్టు విచారించింది. ఈ సందర్భంగా జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ అమితావరాయ్‌లతో కూడిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రతిభావంతులైన విద్యార్థులు ప్రమాణాలు లేని పాఠశాలల్లో చదవటం వల్ల చిన్న ఉద్యోగాలకే పరిమితం అవుతున్నారని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. ధనికులు, ప్రయివేట్ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పెద్ద ఉద్యోగాలు వస్తాయనే భావన ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల్లో నెలకొందని జస్టిస్ దీపక్ మిశ్రా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిని మార్చాల్సిన బాధ్యత ఏపీ సర్కారుపై ఉందని స్పష్టం చేశారు. తెలంగాణలో పాఠశాలల మూసివేత, విద్యా ప్రమాణాల లోపాలపై సుప్రీంకోర్టులో విచారణ తరువాత సమగ్ర ప్రణాళిక చేపట్టిన నేపథ్యంలో, ఆ రాష్ట్ర అనుభవాలను ఏపీ ప్రభుత్వం ఎందుకు పంచుకోకూడదని ఏపీ తరఫు న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది. ఆంధ్రలో 1400 ప్రభుత్వ పాఠశాలలు గత ఏడాది మూతపడ్డాయని, మరో 1300 పాఠశాలలు మూతపడే దశకు చేరుకున్నాయని ఏపీ నిరుద్యోగ ఉపాధ్యాయ సంఘం తరఫు న్యాయవాది శ్రవణ్‌కుమార్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అయితే ప్రభుత్వం తరఫు న్యాయవాది గుంటూరు ప్రభాకర్ ఈ వాదనపై అభ్యంతరం వ్యక్తం చేశారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వార్తాపత్రికల్లోని కథనాలను ఇక్కడ ప్రస్తావిస్తున్నారని అన్నారు. దీంతో ధర్మాసనం కల్పించుకొని పిటిషనర్ తరఫు న్యాయవాది చేసిన వ్యాఖ్యలను కొట్టిపారేయలేమని అన్నారు. పిటీషనర్ లేవనెత్తిన అంశాలపై సమగ్ర నివేదిక తెప్పించుకొని వాటిపై దృష్టిపెడితే తప్పేంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీంతో తెలంగాణ తరఫు న్యాయవాది విశ్యనాథశెట్టి తన వాదన వినిపిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు సైతం ఆంగ్ల విద్యపై ఆసక్తి చూపడంవల్ల ప్రాంతీయ భాషల్లో బోధించే పాఠశాలలు నిరాదరణకు గురవుతున్నాయని కోర్టుకి తెలిపారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ విద్యార్థులకు ఎటువంటి విద్యా బోధన అవసరమో అలాంటి విద్యా ప్రమాణాలు అందిచాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని కోర్టు అభిప్రాయపడింది. తెలంగాణలో విద్యా ప్రమాణాలు పెంచడం, బయోమెట్రిక్ విధానం అమలు, ఉపాద్యాయులపై పర్యవేక్షణ, ఇంగ్లీష్ మీడియం పాఠశాలల ఏర్పాటు సహా పలు అంశాలతో కూడిన విద్యా ప్రణాళికను అమలుచేసి ఎనిమిది వారాల్లో తెలపాలని తెలంగాణను ధర్మాసనం అదేశించింది. ఇంకా తెలంగాణలో గడిచిన నాలుగేళ్లలో ఉపాధ్యాయుల నియామకాలు జరగడం లేదన్న పిటిషనర్ల వాదనలపై వివరణ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. పిటిషన్లపై తదుపరి విచారణను ఫిబ్రవరి 9కి వాయిదా వేసింది.