జాతీయ వార్తలు

దిగిరాని విపక్షాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 22: పార్లమెంటు శీతాకాల సమావేశాల ఐదో రోజు మంగళవారం కూడా ఉభయ సభలు సాగలేదు. పెద్ద నోట్ల రద్దు అనంతరం తలెత్తిన ప్రజా సమస్యలపై తామిచ్చిన వాయిదా తీర్మానాన్ని చర్చకు చేపట్టాలని లోక్‌సభలో విపక్షాలు పట్టుబట్టాయి. బహిరంగ సభలు, ఎన్నికల సభల్లో పెద్దనోట్ల రద్దు గురించి ఉపన్యాసాలిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ రాజ్యసభకు హాజరు కాలేరా? అంటూ రాజ్యసభలో విపక్షాలు నిలదీశాయి. ఆయన వచ్చేవరకూ సభను సాగనిచ్చేది లేదని స్పష్టం చేశాయి. దీనిపై అధికారపక్షం విరుచుకుపడటంతో ఉపాధ్యక్షుడు పిజె కురియన్ మండిపడ్డారు. విపక్షాలు గొడవ చేస్తే అర్థం చేసుకోవచ్చుకానీ, అధికారపక్షం సభా కార్యక్రమాలకు అడ్డుతగలడం తగదని హెచ్చరించారు. లోక్‌సభలో స్పీకర్ సుమిత్రా మహాజన్, ప్రతిపక్షాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సభ్యులు ప్రశాంతంగా ఉంటేనే చర్చకు అనుమతిస్తామని స్పీకర్ చెప్పడంతో, 56 నియమం ప్రకారం చర్చిద్దామంటేనే సభను నడవనిస్తామని ప్రతిపక్షాలు స్పష్టం చేశాయి. దీంతో ఉభయ సభలు రెండుసార్లు వాయిదాలు ఎదుర్కొని, తరువాత బుధవారానికి వాయిదాపడ్డాయి.
మంగళవారం లోక్‌సభ సమావేశం కాగానే స్పీకర్ సుమిత్ర ప్రశ్నోత్తరాల కార్యక్రమం చేపట్టారు. ప్రశ్నోత్తరాలను అడ్డుకుంటూ కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్‌వాదీ, వామపక్షాలకు చెందిన సభ్యులు పోడియంను రెండువైపుల నుంచీ చుట్టిముట్టి ప్రధాని మోదీ, ఎన్డీయేకు వ్యతిరేకంగా నినాదాలిచ్చారు. నోట్ల రద్దుపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంతకుమార్ ప్రకటించినా, నినాదాలతో విపక్షాలు సభను స్తంభింపచేశాయి. ఈ పరిణామాలతో లోక్‌సభ రెండుసార్లు వాయిదా పడింది. దీంతో ప్రభుత్వ పత్రాలను సభకు సమర్పింపచేసి, బుధవారానికి సభను వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ మహాజన్ ప్రకటించారు.
రాజ్యసభలో..
ప్రధాని మోదీ సభకు వచ్చి తాము చెప్పేది వినేవరకూ సభను సాగనిచ్చేది లేదని రాజ్యసభలో ప్రతిపక్షం నాయకుడు గులాం నబీ ఆజాద్, సిపిఎం పక్షం నాయకుడు సీతారాం ఏచూరి, బిఎస్పీ పక్షం నాయకురాలు మాయావతి, తృణమూల్ సీనియర్ నాయకుడు డెరిక్ ఓబ్రీన్, జెడి(యు) పక్షం నాయకుడు శరద్ యాదవ్ స్పష్టం చేశారు. బహిరంగ, ఎన్నికల సభల్లో ఉపన్యాసాలిస్తున్న ప్రధాని మోదీ, సభకు వచ్చి ఎందుకు వివరించటం లేదని ముక్తకంఠంతో ప్రశ్నించారు. పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వి జోక్యం చేసుకుంటూ నోట్ల రద్దుపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ వస్తేనే చర్చస్తామంటున్న విపక్షాల డిమాండ్‌ను అంగీకరించే ప్రసక్తే లేదన్నారు. ఈ దశలో బిజెపి సభ్యులు లేచి ప్రతిపక్షానికి వ్యతిరేకంగా నినాదాలిచ్చారు. దీనిపై సభ ఉపాధ్యక్షుడు కురియన్ మండిపడుతూ ప్రతిపక్షం గొడవ చేస్తే అర్థముంది. అధికారపక్షం సభా కార్యక్రమాలకు అడ్డుపడటం ఏమిటి? అంటూ నిలదీశారు. నోట్ల రద్దు అంశంపై సభ్యులు చర్చిస్తే, ప్రధాని మోదీ వచ్చి సమాధానమిస్తారని కురియన్ సూచించారు. దీనికి విపక్షాలు అంగీకరించలేదు. దీంతో అధికార, ప్రతిపక్షాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుని నినాదాలాతో సభ దద్దరిల్లింది. కాంగ్రెస్ సభ్యులు ఎంఏ ఖాన్, కెవిపి రాచందర్‌రావు తదితరులు పోడియం వద్ద నిలబడి ప్రభుత్వానికి వ్యతిరేంగా నినాదాలిచ్చారు. సభను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించి విఫలమైన కురియన్, బుధవారానికి వాయిదా వేశారు.

చిత్రం.. లోక్‌సభలో మంగళవారం నాటి దృశ్యం