జాతీయ వార్తలు

నోట్ల రద్దును సమర్థిస్తున్నారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 22: దేశంలో పెద్ద నోట్ల రద్దును మీరు సమర్థిస్తున్నారా? వ్యతిరేకిస్తున్నారా? ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఇదే ప్రశ్నను ప్రజలందరినీ అడుగుతున్నారు. నేరుగా తనకే జవాబివ్వాలంటూ అవకాశం ఇస్తున్నారు. ‘నమో’ యాప్ ద్వారా ప్రజలు తమ అభిప్రాయాలను వెల్లడించవచ్చు. ‘‘రూ.500, రూ.1000 నోట్ల రద్దుకు సంబంధించి నేను మీ నుంచి నేరుగా ప్రాథమిక అభిప్రాయాన్ని కోరుతున్నాను’’ అని మోదీ తన ట్విట్టర్ ఖాతాలో పౌరులకు పిలుపునిచ్చారు. నమో యాప్‌లో ప్రభుత్వం ప్రజల ముందు కొన్ని ప్రశ్నలుంచింది.
* దేశంలో నల్లధనం ఉందా? * దేశంలో అవినీతి, నల్లధనం భూతాలను అంతం చేయాలని మీరు భావిస్తున్నారా?
* మోదీ ప్రభుత్వం రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయంపై మీరేమనుకుంటున్నారు?
* ఈ అంశంపై ప్రధానికి మీరేమైనా సలహా ఇవ్వదలచుకున్నారా? * అవినీతి, నల్లధనం, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కరెన్సీ రద్దుద్వారా చేస్తున్న యుద్ధంవల్ల ఇబ్బంది పడుతున్నామని భావిస్తున్నారా?