జాతీయ వార్తలు

సామాన్యుడి క్షోభ పట్టదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ / కోల్‌కతా, నవంబర్ 22: దేశవ్యాప్తంగా పెద్దనోట్ల రద్దు సామాన్య జన జీవనాన్ని కకావికలు చేస్తోందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతూ ప్రతిపక్ష పార్టీలు బుధవారం ఢిల్లీలో భారీఎత్తున నిరసన ప్రదర్శనలు చేపట్టాలని నిర్ణయించాయి. మరోపక్క వారం పాటు దేశ వ్యాప్తంగా సంయుక్త ఉద్యమం చేపట్టాలని ఆరు వామపక్ష పార్టీలు నిర్ణయించాయి. ప్రజల అగచాట్లతో ఏ మాత్రం సంబంధం లేకుండా కేంద్రం వ్యవహరిస్తోందని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. రేపు ఢిల్లీలో జరుగనున్న ధర్నాకు కూడా పూర్తి మద్దతనిస్తున్నామని తెలిపారు. 500, 1000 నోట్ల రద్దువల్ల ప్రజలకు కలుగుతున్న ఇబ్బందులను ప్రభుత్వ దృష్టికి తేవడానికే తాను స్వయంగా ధర్నా చేపడుతున్నానని, ఇందుకు అన్ని విపక్షాలు మద్దతు ఇవ్వాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అప్పీలు చేశారు. కోల్‌కతా విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడిన ఆమె, అనాలోచితంగా పెద్ద కరెన్సీని రద్దు చేయడం వల్ల అన్ని వర్గాల ప్రజలు అవస్థలు పడుతున్నారని తెలిపారు. తాము చేపడుతున్న ధర్నాకు మద్దతు ఇవ్వడానికి ఏ పార్టీ ముందుకు వచ్చినా స్వాగతిస్తామన్నారు. పార్లమెంటులో విపక్షాలన్నీ కలిసి పనిచేస్తున్నాయని తెలిపారు. నోట్ల రద్దుకు నిరసనగా జంతర్ మంతర్ నుంచి పార్లమెంటుకు ఊరేగింపుగా వెళ్లేందుకు ప్రయత్నించిన ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, ఆయన మంత్రివర్గ సహచరుడు కపిల్ మిశ్రాలను పోలీసులు నిర్బంధించారు. ఒకపక్క ప్రజలు తమ ఇబ్బందులు తట్టుకోలేక కన్నీటి పర్యంతం అవుతుంటే, ప్రధాని నరేంద్ర మోదీ మొసలికన్నీరు కారుస్తున్నారంటూ సిసోడియా ధ్వజమెత్తారు. బిజెపి మిత్రపక్షమైన శివసేన సైతం నోట్ల రద్దుపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. నోట్ల రద్దును సమర్థించేవారిని దేశ భక్తులుగా, వ్యతిరేకించే వారిని దేశ ద్రోహులుగా ముద్రవేసే ప్రయత్నాలు మానుకోవాలని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే అన్నారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా వరుసగా నాలుగో రోజైన మంగళవారం మోదీ సర్కారుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. టెలివిజన్లలోనూ, పాప్ కచేరీల్లోనూ మాట్లాడుతున్న మోదీకి పార్లమెంటులో మాట్లాడే తీరిక లేదంటూ ధ్వజమెత్తారు. కాగా, పార్లమెంటు భవనం వెలుపల ఉన్న గాంధీ విగ్రహం వద్ద బుధవారం ఉదయం 9.45 గంటలకు ధర్నా జరుపుతామని కాంగ్రెస్ నాయకుడు జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. ఈ అంశంపై రాష్టప్రతిని కూడా కలుసుకుంటామని పేర్కొన్న ఆయన, అదే అప్పుడో మాత్రం చెప్పలేదు. ఒకదాని తర్వాత ఒకటిగానే మోదీ ప్రభుత్వంపై వత్తిడి తీసుకొస్తామని పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా బుధవారంనాటి ధర్నాకు సంబంధించి అనుసరించాల్సిన వ్యూహంపై చర్చలు జరిపాయి. ఈ సమావేశంలో కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, జెడి(యు), సిపిఎం, సిపిఐ, ఎన్‌సిపి, ఆర్జేడీ నేతలు పాల్గొన్నారు.

చిత్రం.. కోల్‌కతాలో మంగళవారం విలేఖరులతో మాట్లాడుతున్న మమతా బెనర్జీ