జాతీయ వార్తలు

అధికార పార్టీలదే హవా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 22: ఆరు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో జరిగిన ఉపఎన్నికల్లో అధికార పార్టీలు తమ పట్టును నిలబెట్టుకున్నాయి. పశ్చిమ బెంగాల్, అసోం, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో నాలుగు లోక్‌సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్, బిజెపిలు చెరి రెండు స్థానాలను దక్కించుకున్నాయి. పశ్చిమ బెంగాల్‌లోని రెండు లోక్‌సభ స్థానాలను అధికార తృణమూల్ కాంగ్రెస్ గెలుచుకోగా, అసోం, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బిజేపి విజయం సాధించింది. ఈ నెల 19న ఈ స్థానాలకు పోలింగ్ జరగ్గా, మంగళవారం ఓట్ల లెక్కింపు జరిగింది. వివిధ రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరిగిన 10 అసెంబ్లీ స్థానాల్లో బిజెపి, అన్నాడిఎంకె చెరి మూడు స్థానాలను దక్కించుకోగా, సిపిఎం రెండు, కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చెరో స్థానాన్ని దక్కించుకున్నాయి.
అసోంలో ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ ఖాళీ చేసిన లఖింపూర్ లోక్‌సభ స్థానాన్ని లక్షా 90 వేలకు పైగా భారీ మెజారిటీతోను, మధ్యప్రదేశ్‌లోని షాదోల్ లోక్‌సభ స్థానాన్ని బిజెపి దక్కించుకుంది. కాగా, పశ్చిమ బెంగాల్‌లోని తామ్లుక్, కూచ్‌బిహార్ లోక్‌సభ స్థానాలను అధికార తృణమూల్ కాంగ్రెస్ భారీ మెజారిటీతో దక్కించుకుంది.
2014 లోక్‌సభ ఎన్నికల్లో ఈ స్థానాల్లో ఆ పార్టీకి వచ్చిన మెజారిటీకి ఇప్పుడు రెట్టింపు రావడం గమనార్హం. తృణమూల్ కాంగ్రెస్ మోంటేశ్వర్ అసెంబ్లీ స్థానాన్ని కూడా దక్కించుకుంది. ఇక్కడ పోటీ చేసిన సిపిఎం, కాంగ్రెస్, బిజెపి అభ్యర్థులు ధరావతులు కోల్పోవడం గమనార్హం. కాగా, మధ్యప్రదేశ్‌లోని షాదోల్ లోక్‌సభ స్థానంలో బిజెపి మెజారిటీ గత లోక్‌సభ ఎన్నిల్లో సాధించిన 2.41 లక్షలనుంచి 60 వేలకు తగ్గిపోయింది. ఆ పార్టీ నేపానగర్ అసెంబ్లీ స్థానాన్ని సైతం తన ఖాతాలో వేసుకుంది.
తమిళనాడులో అధికార అన్నాడిఎంకె తంజావూరు, తిరుప్పరకుండ్రం అసెంబ్లీ స్థానాలను నిలబెట్టుకోవడంతోపాటుగా అరవకురుచ్చి స్థానాన్ని డిఎంకెనుంచి దక్కించుకుంది. ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యం కారణంగా రెండు నెలలుగా ఆస్పత్రిలో ఉన్నప్పటికీ మూడు స్థానాలనూ గెలుచుకోవడం గమనార్హం. త్రిపురలో అధికార సిపిఎం బర్జాలా ఎస్సీ స్థానాన్ని కాంగ్రెస్‌నుంచి దక్కించుకోగా ఖోవై స్థానాన్ని తిరిగి నిలబెట్టుకుంది. పుదుచ్చేరిలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వి నారాయణ స్వామి నెల్లితోపు నియోజకవర్గంనుంచి అన్నాడిఎంకె అభ్యర్థి ఓం శక్తిసెగర్‌పై 11,144 ఓట్ల తేడాతో ఘనవిజయం సాధించారు. అరుణాచల్‌ప్రదేశ్‌లోని హయలియంగ్ అసెంబ్లీ స్థానంలో నార్త్‌ఈస్ట్ డెమోక్రటిక్ అలయెన్స్ అభ్యర్థి, బిజెపికి చెందిన దసంగ్లు పుల్ తన ఏకైక ప్రత్యర్థి యోంపి క్రిని 942 ఓట్ల తేడాతో ఓడించారు. ఆత్మహత్య చేసుకున్న మాజీ ముఖ్యమంత్రి కలిఖో పుల్ ముగ్గురు భార్యల్లో చిన్న భార్య దసంగ్లు పుల్.

చిత్రాలు..పుదుచ్చేరిలో విజయం సాధించిన ముఖ్యమంత్రి వి నారాయణ స్వామి. మహారాష్టల్రోని
సంగ్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందిన కాంగ్రెస్ అభ్యర్థి మోహన్ సేథ్ కదమ్