జాతీయ వార్తలు

పూర్తిగా కోలుకున్న జయ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, నవంబర్ 29: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం బాగా మెరుగైందని, త్వరలోనే డిశ్చార్జ్ అవుతారని అన్నాడిఎంకె వర్గాలు వెల్లడించాయి. అమ్మ ఆరోగ్యం మామూలు స్థితికి చేరుకుందని పార్టీ అధికార ప్రతినిధి సిఆర్ సరస్వతి మంగళవారం తెలిపారు. ‘అమ్మ చక్కగా ఆహారం తీసుకుంటున్నారు. ఫిజియోథెరపీ జరుగుతోంది. త్వరలోనే ఇంటికి వచ్చేస్తారు’ అని ఆమె స్పష్టం చేశారు. 68 ఏళ్ల జయ తీవ్ర అస్వస్థతతో సెప్టెంబర్ 22న అపోలో ఆసుపత్రిలో చేరారు. తీవ్రమైన జర్వం, డిహైడ్రేషన్‌తో బాధపడుతున్న ఆమెకు వైద్యులు చికిత్స చేశారు. ఇన్‌ఫెక్షన్ సోకకుండా అపోలో వైద్యులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. దేశ విదేశీ వైద్య నిపుణులు పర్యవేక్షణలో అన్నాడిఎంకె అధినేత్రికి వైద్య సేవలు అందాయి. స్పీకర్ సాయంతో ముఖ్యమంత్రి మాట్లాడారని అపోలో చైర్మన్ ప్రతాప్ సి రెడ్డి గతవారమే వెల్లడించారు.