జాతీయ వార్తలు

రాష్ట్రంలో ఆయుర్వేద పరిశోధనా కేంద్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ,నవంబర్ 29: తెలంగాణాలో ఆయుర్వేద పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి శ్రీపాదనాయక్ ఆమోదం తెలిపారు. కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి వెంకయ్యనాయుడు మంగళవారం పార్లమెంటు ఆవరణలో శ్రీపాదనాయక్‌తో చర్చలు జరిపారు. తెలంగాణా బిజెపి రాష్ట్ర శాఖ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్, అసెంబ్లీలో శాసనసభా పక్ష నేత కిషన్ రెడ్డి, ఎంఎల్‌ఏలు చింతల రామచంద్రారెడ్డి, ఎన్‌విఎస్‌ఎస్ ప్రభాకర్, ఎంఎల్‌సి రామచందర్‌రావు తదితరులు ఈరోజు వెంకయ్యనాయుడును కలిసి తెలంగాణాకు సంబంధించిన పలు ప్రాజెక్టుల గురించి చర్చించారు. విజయవాడలో ఏర్పాటు చేసిన విధంగా తెలంగాణాలో కూడా ఆయుర్వేద పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని వారు వెంకయ్యనాయుడును కోరారు. ఆయన వెంటనే శ్రీపాద నాయక్‌ను తమ చాంబర్‌కు పిలిపించుకుని తెలంగాణాలో ఆయుర్వేద పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయటం గురించి చర్చించారు. తెలంగాణలో ఆయుర్వేద పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేయవలసిన అవసరాన్ని బిజెపి నాయకులు వివరించిన వెంటనే శ్రీపాద నాయక్ వారి విజ్ఞప్తిని సూత్రప్రాయంగా ఆమోదించారు.