జాతీయ వార్తలు

7న నింగిలోకి పిఎస్‌ఎల్‌వి-సి 36

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, డిసెంబర్ 1: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో భారీ ప్రయోగానికి సన్నద్ధమవుతోంది. భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ థావన్ స్పేస్ సెంటర్ షార్ కేంద్రం నుండి ఈనెల 7న పిఎస్‌ఎల్‌వి-సి 36 రాకెట్ ప్రయోగం జరిపేందుకు ఇస్రో ముహూర్తం ఖరారు చేసింది. ఈ రాకెట్ ద్వారా 1235 కిలోల బరువు గల రీసోర్స్‌శాట్-2ఎ ప్రధాన ఉపగ్రహంతో పాటు విద్యార్థులు రూపొందించిన రెండు చిన్న ఉపగ్రహాలు, విదేశాలకు చెందిన మరో రెండు ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక వద్ద రాకెట్ నాలుగు దశల అనుసంధాన పనులు పూర్తిచేసి చివరి భాగంలో ఉపగ్రహాలను అమర్చి శాస్తవ్రేత్తలు రాకెట్‌ను ప్రయోగానికి సిద్ధం చేశారు. వాతావరణం అనుకూలించి అన్నీ సజావుగా సాగితే ఈనెల 7వ తేదీ ఉదయం 10:24 గంటలకు పిఎస్‌ఎల్‌వి-సి 36 రాకెట్ షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుండి నింగిలోకి దూసుకెళ్లనుంది.