జాతీయ వార్తలు

చర్చకు షరతులేంటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 1: పెద్దనోట్ల రద్దు వలన ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చ జరిపేందుకు సిద్ధమంటూనే షరతులు విధించటం ఎంతవరకు సమంజసమని లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ గురువారం ప్రతిపక్షాన్ని నిలదీశారు. ఏదో ఒక నియమం కింద చర్చ జరిపే అధికారం మీకున్నది, మీకున్న అధికారం మేరకు వెంటనే చర్చ ప్రారంభించాలని అంటారు, చర్చ ప్రారంభిస్తే మాట్లాడకుండా పోడియం వద్దకు వచ్చి గొడవ చేస్తారు, ఏమిటిది? అంటూ అమె అసహనం వ్యక్తం చేశారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చ ప్రారంభిస్తున్నాం, మీరంతా మీ సీట్లలోకి వెళ్లి చర్చలో పాల్గొనాలంటూ సుమిత్రా మహాజన్ పలుమార్లు ప్రతిపక్షానికి విజ్ఞప్తి చేశారు. అయితే కాంగ్రెస్, తృణమూల్ సభ్యులు మాత్రం ఓటింగ్‌తో కూడిన చర్చ జరిపితేనే పాల్గొంటామని షరతు విధించారు. కాంగ్రెస్, తృణమూల్ చర్చ నుండి పారిపోతున్నాయని పార్లమెంటరీ వ్యవసారాల శాఖ మంత్రి అనంత్‌కుమార్ విమర్శించారు.
లోక్‌సభ గురువారం ఉదయం పదకొండు గంటలకు సమావేశం కాగానే టిఎంసి సభ్యులు లేచి మమతా బెనర్జీ ప్రయాణం చేస్తున్న విమానానికి కోల్‌కత్తా విమానాశ్రయంలో ఆఖరుక్షణం వరకు దిగేందుకు అనుమతి ఇవ్వకుండా ఆమెను రూపుమాపేందుకు కుట్ర చేశారని ఆరోపించారు. టిఎంసితోపాటు కాంగ్రెస్, వామపక్షాల సభ్యులు కూడా పోడియం వద్దకు వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పౌర విమాన యాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు లేచి మమతా బెనర్జీ ప్రయాణిస్తున్న విమానం కోల్‌కత్తా విమానాశ్రయంలో దిగటంలో ఆలస్యం జరగటానికి దారి తీసిన పరిస్థితుల గురించి వివరించారు. ఈ సంఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్లు తెలిపారు. టిఎంసి సభ్యులు మాత్రం ఇదేం పట్టించుకోకుండా గొడవ చేశారు. సుమిత్రా మహాజన్ మాత్రం వారి గొడవ మధ్యే ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని కొనసాగించారు. దాదాపు నలభై ఐదు నిమిషాలపాటు అలానే సభను కొనసాగించి పనె్నండు గంటల వరకు వాయిదా వేశారు. తిరిగి సమావేశం కాగానే అధికార పత్రాలను సభకు సమర్పింపజేశారు. 377 నియమం నోటీసులను కూడా సభకు సమర్పింపజేసిన అనంతరం జీరో అవర్ కార్యక్రమం చేపట్టారు. ఈ దశలో కాంగ్రెస్ పక్షం నాయకుడు మల్లిఖార్జున ఖర్గే లేచి పెద్దనోట్ల రద్దు మూలంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఏదో ఒక నియమం కింద చర్చ జరపాలని స్పీకర్‌ను కోరారు. తాము డిమాండ్ చేస్తున్న విధంగా 56 నియమం కింద చర్చ చేపట్టటం ప్రభుత్వానికి ఇష్టం లేకపోతే మీకు ఇష్టం వచ్చిన నియమం కింద చర్చ జరపాలి కానీ ఓటింగ్ ఉండాలని ఆయన సుమిత్రా మహాజన్‌కు సూచించారు. ప్రభుత్వం చర్చనుండి ఎందుకు పారిపోతోందని నిలదీశారు. టిఎంసి పక్షం నాయకుడు సుదీప్ బందోపాధ్యాయ మాట్లాడుతూ ఓటింగ్‌తో కూడిన చర్చ కావాలని డిమాండ్ చేశారు. టిఆర్‌ఎస్ పక్షం నాయకుడు జితేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు రాష్ట్రాన్ని డిజిటల్ రాష్ట్రంగా మార్చివేసేందుకు చర్యలు చేపట్టారని ప్రకటించారు.
తమ పార్టీ ఎలాంటి చర్చకైనా సిద్ధమే, ప్రజల ఇబ్బందులు తొలగించేందుకు పలు సూచనలు చేస్తామని చెప్పారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంతకుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉన్నా ప్రతిపక్ష సభ్యులు మాత్రం గొడవ చేస్తున్నారని ఆరోపించారు. దీనితో సుమిత్రా మహాజన్ పదిహేను నిమిషాలపాటు సభను వాయిదా వేశారు. సభ తిరిగి సమావేశమైన తరువాత కూడా అధికార పక్షం పోడియం వద్దకు వచ్చి గొడవ చేయటంతో శుక్రవారం ఉదయం వరకు వాయిదా వేశారు.

చిత్రం..గురువారం లోక్‌సభలో మాట్లాడుతున్న విపక్ష నేత మల్లికార్జున ఖర్గే